Google vs Apple : గూగుల్ ఆపిల్ నువ్వా నేనా

సెర్చ్ ఇంజ‌న్ పై ఫోక‌స్

Google vs Apple : యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు గూగుల్ జ‌పం చేస్తోంది. దానిని ప‌డ‌గొట్టాల‌ని నానా తంటాలు ప‌డుతున్నాయి దిగ్గ‌జ కంపెనీలు. ఓ వైపు మైక్రోసాఫ్ట్ బింగ్ పేరుతో సెర్చ్ ఇంజ‌న్ త‌యారు చేసింది.

కానీ టెక్ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ ను ఢీకొట్ట‌లేక పోతోంది. గూగుల్ దెబ్బ‌కు యాహూ, రీడిఫ్ ఉన్నా లేన‌ట్టుగా మారి పోయాయి. ఇప్ప‌టికే ఐటీ సెక్టార్ లో కీల‌కంగా ఉన్న కంపెనీల‌న్నీ గూగుల్ ను దెబ్బ కొట్టాల‌ని అనుకున్నా ఆచ‌ర‌ణ‌లో సాధ్యం కావ‌డం లేదు.

ఇప్పుడు యావ‌త్ ప్ర‌పంచం గూగుల్(Google vs Apple)  క‌నుస‌న్న‌ల‌లో న‌డుస్తోంది. అంతలా పాపుల‌ర్ అయ్యింది. ఒక‌ప్పుడు చిన్న గ‌దిలో ప్రారంభ‌మైన ఈ సెర్చ్ ఇంజ‌న్ ఇప్పుడు వ‌ర‌ల్డ్ లో నెంబ‌ర్ వ‌న్.

ప్ర‌స్తుతం ఈ దిగ్గ‌జ కంపెనీకి సిఇఓగా భార‌త దేశానికి చెందిన సుంద‌ర్ పిచాయ్ ఉన్నాడు. ఇక ఏపీకి చెందిన స‌త్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కు సిఇఓగా ఉన్నాడు. వీరి జీతాలు ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ వైడ్ గా ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అదేమిటంటే అమెరికాకు చెందిన దిగ్గ‌జ కంపెనీ ఆపిల్ గూగుల్(Google vs Apple) ను ఢీకొట్టాల‌ని చూస్తోంది. దానికి ప్ర‌త్యామ్నాయంగా సెర్చ్ ఇంజ‌న్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

త‌మ‌కంటూ సొంత సెర్చ్ ఇంజ‌న్ ఉండాల‌ని అనుకుంటోంది. ఎంత ఖ‌ర్చు అయినా స‌రే వెచ్చించేందుకు రెడీగా ఉందంట ఆపిల్ యాజ‌మాన్యం.

2023 నాటికి అది అందుబాటులోకి రానుంద‌ని టెక్ బ్లాగ‌ర్ సోబ‌ల్ అంచ‌నా వేశాడు. జ‌న‌వ‌రిలోనే ప్ర‌పంచాన్ని ఆపిల్ సెర్చ్ ఇంజ‌న్ డిఫ‌రెంట్ గా ప‌ల‌క‌రించ బోతోందంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టాడు.

Also Read : షియోమీ ఇండియా జీఎంగా ఆల్విన్ త్సే

Leave A Reply

Your Email Id will not be published!