Gorantla Butchaiah Chowdary: జగన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
జగన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
Gorantla Butchaiah Chowdary : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే జగన్ మా రాజమహేంద్రవరంకు వస్తారని… కాకపోతే రిమాండ్ ఖైదీగా జైలులో ఉంటారంటూ జోస్యం చెప్పారు. గత ఐదేళ్ళలో పాలనను గాలికి వదిలేసి… ల్యాండ్, శాండ్, మైన్, వైన్ అంటూ లక్షల కోట్లు అవినీతికి పాల్పడిన వైఎస్ జగన్ కు… త్వరలోనే చట్టం ప్రకారం తగిన శిక్ష పడుతుందన్నారు. ఇప్పటికే ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడిందని… ఇక న్యాయస్థానం అతని నేరాల చిట్టా విప్పబోతుంది అన్నారు.
Gorantla Butchaiah Chowdary Slams
నియోజకవర్గాల పునర్విభజనపై కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో సీఎం, డిప్యూటీ సీఎం అంతర్గతంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నందున బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా క్రమశిక్షణ పాటించాయని చెప్పారు. ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదన్నారు.
‘‘నిన్న మాజీ సీఎం జగన్ అపర గోబెల్స్‌లా మాట్లాడారు. మరో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని ఆయన అంటున్నారు. ఆయన వచ్చేది రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకే. వైసీపీ హయాంలోని లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. జగన్ హయాంలో పంటలకు బీమా కూడా చెల్లించకపోవడంతో రైతులు రూ.వేల కోట్లు నష్టపోయారు. గత ప్రభుత్వం గ్రామాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదు. జగన్ మళ్లీ జైలు ఊచలు లెక్కించాల్సిందే.
Also Read : Telangana Cabinet: త్వరలో తెలంగాణా కేబినెట్ విస్తరణ ! ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ?