Gotabaya Rajapaksa : సింగపూర్ కు గోటబయ రాజపక్సే పరార్
శ్రీలంక దేశం నుంచి పారి పోయిన ప్రెసిడెంట్
Gotabaya Rajapaksa : లంకేయుల దెబ్బకు శ్రీలంక దేశం విడిచి మాల్దీవులకు పారి పోయిన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే(Gotabaya Rajapaksa) ఫ్యామిలీ అక్కడి నుంచి సింగపూర్ కు వెళ్లనున్నట్లు సమాచారం.
ఓ వైపు రాజభవనాన్ని ప్రజలు ముట్టడించి స్వాధీనం చేసుకున్నారు. అక్కడే తిష్ట వేశారు ఆందోళనకారులు. ఇంకో వైపు ప్రధాని కార్యాలయంలోకి చొచ్చుకు పోయారు.
జాతీయ జెండాలను ఎగుర వేశారు. ఇదిలా ఉండగా తాను బుధవారం వరకు రాజీనామా చేస్తానని స్పీకర్ కు చెప్పిన గోటబయ ఇప్పటి వరకు తన రిజైన్ లెటర్ ఇవ్వలేదు.
దీంతో జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోదరుడు ప్రధానిగా ఉన్న మహీంద రాజపక్సే ఇంటిపై దాడికి దిగడంతో తప్పించుకుని పారి పోయాడు. నేవీ, ఆర్మీ బేస్ క్యాంపులో తలదాచుకున్నాడు.
మొత్తం రాజపక్సే(Gotabaya Rajapaksa) కుటుంబం చేతిలో శ్రీలంక బందీ అయి పోయింది. దొడ్డి దారిన ఆర్మీ సహకారంతో గోటబయ , భార్య, అంగరక్షకులతో కలిసి చెక్కేశాడు. దీనికి భారత్ సహకరించిందని శ్రీలంక మీడియా ఆరోపించింది.
దీనిని భారత్ ఖండించింది. ఇదే సమయంలో గోటబయ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాన మంత్రి రణిలే విక్రమ సింఘేకు బాధ్యతలు అప్పగించాలని తీసుకున్న నిర్ణయం మరింత ఆందోళనలు, నిరసనలకు దారి తీసేలా చేసింది.
కాగా లంకేయులు తనపై దాడి చేసేందుకు చాన్స్ ఉందనే భయంతో తనను సింగపూర్ కు తరలించేందుకు ప్రైవేట్ జెట్ ను ఏర్పాటు చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని గోటబయ కోరినట్లు సమాచారం.
దాడి చేసే అవకాశం ఉందనే భయంతో సింగపూర్ సేఫ్ సిటీ అని ఎంచుకున్నట్లు టాక్.
Also Read : లంకలో మిన్నంటిన నిరసన ఒకరు మృతి