Gotabaya Rajapaksa : అధికార మార్పిడికి గోటబోయ సిద్ధం
రేపే రాజీనామా ఓడ మార్గం ద్వారా జర్నీ
Gotabaya Rajapaksa : దేశం సంక్షోభంలో కూరుకు పోవడం, ప్రధానంగా తనపై , కుటుంబంపై పెల్లుబుకిన ఆగ్రహంతో రాజభవనం నుంచి పారి పోయాడు.
అంతకు ముందు తన సోదరుడు ప్రధాన మంత్రిగా ఉన్న మహీంద రాజపక్సే రాజనామా చేసి పీఎం భవనంపై దాడి చేయడంతో పారి పోయి ఆర్మీ క్యాంపులో తలదాచుకున్నారు.
ఇదే సమయంలో జనాగ్రహం దెబ్బకు వణుకుతున్నాడు. ఎయిర్ పోర్ట్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నం చేసిన గోటబోయ రాజపక్సే(Gotabaya Rajapaksa) సోదరుడు పోకుండా అడ్డుకున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు.
దీంతో కోలుకోలేని షాక్ తగిలింది. ఈ మేరకు ప్రధానమంత్రిగా రణిలే విక్రమ సంఘే సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఈ తరుణంలో విపక్షాలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలికారు.
ఈ మేరకు ఓ వైపు అధ్యక్షుడితో పాటు ప్రధానమంత్రి తప్పుకున్నారు. ఇప్పటికే రాజభవనం ముట్టించడంతో పాటు అక్కడే నిరసనకారులు తిష్ట వేశారు. ఇదే సమయంలో ప్రధాన మంత్రి ఇంటికి నిప్పంటించారు.
ఆపై పీఎంకు చెందిన వాహనాల్ని ధ్వంసం చేశారు. ఈ తరుణంలో శ్రీలంకకు ప్రస్తుతం పార్లమెంట్ స్పీకర్ దేశ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఆయన నెల రోజుల పాటు చీఫ్ గా ఉంటారు.
ఇదే సమయంలో విపక్షాలు కొంత కాలం సర్కార్ ను ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పాయి. దీంతో ఈనెల 13న తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయనున్నారు గోటబోయ రాజపక్సే(Gotabaya Rajapaksa) .
ఇదే సమయంలో విమాన ప్రయాణంలో కాకుండా సముద్రం ద్వారా తప్పించు కునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నేవ పెట్రోలింగ్ క్రాఫ్ట్ ను ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లు టాక్. దుబాయ్ కి వెళుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : భారత్ సాయం మరిచి పోలేం – జయసూర్య