KCR vs Governor HC : గవర్నర్ ప్రసంగంపై సర్కార్ వెనక్కి
పిటిషన్ వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
KCR vs Governor HC : తెలంగాణ సర్కార్ వర్సెస్ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చివరకు హైకోర్టు దాకా వెళ్లింది. ఓ వైపు కేంద్రం న్యాయ వ్యవస్థను టార్గెట్ చేస్తోంది. అక్కడ కొలీజియం వ్యవస్థ మీద రాళ్లు వేస్తోంది. తమ జోక్యం లేకుండా ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రశ్నిస్తోంది.
ఈ తరుణంలో తెలంగాణలో కొత్త రాద్దాంతానికి తెర లేపింది రాష్ట్ర సర్కార్ ప్రవేశ పెట్టే బడ్జెట్. ఏదైనా ప్రజలకు సంబంధించి నిధులు ఖర్చు చేయాలన్నా లేదా మంజూరు చేయాలన్నా ముందు గవర్నర్ ఆమోదం ఉండాలి. ఎంత వ్యక్తిగత ద్వేషం ఉన్నా రాజ్యాంగం ప్రకారం నడుచు కోవాల్సిందే.
గత కొంత కాలంగా రాష్ట్ర సర్కార్ కు గవర్నర్ కు పడడం లేదు. ఒక రకంగా పొసగడం లేదు. చివరకు వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది వ్యవహారం. ప్రస్తుతం గవర్నర్ లేకుండానే బడ్జెట్ ప్రవేశ పెట్టాలని ప్లాన్ చేస్తోంది సర్కార్(KCR vs Governor HC). అసలు గవర్నర్ అవసరం ఎందుకోసమని ప్రశ్నిస్తోంది. ఈ తరుణంలో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది పిటిషన్ లో.
గవర్నర్ బడ్జెట్ ఆమోదించడం లేదంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ప్రసంగం ఉండాల్సిందేనని స్పష్టం చేయడంతో సర్కార్ వెనక్కి తగ్గింది. ఇందులో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటందని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో గవర్నర్ ప్రసంగం ఉండనుంది.
Also Read : తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శం