Telangana Budget : అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడి సంక్షేమానికి ప్రయారిటీ ఇచ్చాయి. ఏపీ విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, వ్యవసాయంపై ఫోకస్ పెట్టింది.
ఇక తెలంగాణ బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉన్నప్పటికీ ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి ఇప్పటి దాకా ప్రస్తావించిక పోవడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి.
ఓ వైపు నిరుద్యోగులు ఇంకో వైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సర్కార్ పట్టించు కోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇవాళ ఆర్థిక మంత్రి హరీష్ రావు 2022-23 ఏడాదికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
ప్రశ్నించేందుకు లేకుండా బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే కానిచ్చేశారు. ఇక కేటాయింపుల పరంగా చూస్తే ఈ విధంగా ఉన్నాయి.
దళిత బంధుకు భారీగా నిధులు కేటాయించారు. వీరి కోసం రూ. 17,700 కోట్లు కేటాయించడం విశేషం. 118 నియోజకవర్గాలలో 11 వేల 800 మందికి ఈ పథకం కింద సాయం(Telangana Budget )అందనుంది.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అందించాలని నిర్ణయించింది. రూ. 7, 289 కోట్లతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులు (Telangana Budget )చేపట్టనుంది.
రాష్ట్రంలో మహిళా యూనివర్శిటీ కోసం రూ. 100 కోట్లు కేటాయించింది. అంతే కాకుండా కొత్తగా అటవీ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం రూ. 1000 కోట్లు కేటాయించింది. పామాయిల్ సాగును పెంచేందుకు ప్రోత్సహంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ఇందు కోసం రూ. 1000 కోట్లు కేటాయించింది. రైతు బంధు కింద 63 లక్షల కుటుంబాలకు రూ. 50, 448 కోట్లు కేటాయించింది.
వృద్దాప్య పెన్షన్ల మంజూరు కు విధించిన వయో పరిమితిని 57 ఏళ్లకు తగ్గించింది.
జాగా ఉంటే రూ. 3 లక్షలు ఇస్తుంది. ఆర్టీసీ బలోపేతానికి రూ. 1500 కోట్లు కేటాయించింది సర్కార్.
Also Read : ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తం కేసీఆర్ ను నిలదీస్తం