CM PUNJAB : పంజాబ్ అసెంబ్లీలో 92 స్థానాలతో అఖండ విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ(CM PUNJAB) మొదటిసారిగా పవర్ లోకి వచ్చింది. ఊహించని రీతిలో భారీ స్థానాలను కైవసం చేసుకుని ప్రధాన రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది.
ఆప్ సీఎం అభ్యర్థిగా ఎన్నికల కంటే ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఇక ప్రమాణ స్వీకారం లాంఛనంగా మారింది.
గతంలో పాలకులు భవంతులకే పరిమితం అయ్యారని కానీ తాము ప్రజలు, సామాన్యులు, అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తామని స్పష్టం చేశారు సీఎం అభ్యర్థి భగవంత్ మాన్(CM PUNJAB). ఆయన సంచలన విషయాలు ప్రకటించారు.
ప్రచారానికి దూరంగా ఉంటానని అన్నారు. తాను కూడా కామన్ మ్యాన్ నని పేర్కొన్నారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలకు తావు లేకుండా పాలన సాగిస్తామని చెప్పారు.
అంతే కాకుండా రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఇక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ( అంటే తన ఫోటో ) ఉండదని ప్రకటించాడు భగవంత్ మాన్.
సీఎం ఫోటోకు బదులు ప్రతి ఆఫీసులో సర్దార్ షహీద్ భగత్ సింగ్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంటుందని స్పష్టం చేశారు.
తాము ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నామంటూ ఆరోపణలు చేసిన వారంతా ఇప్పుడు దారుణంగా ఓటమి పాలై ఇంటి బాట పట్టారని ఎద్దేవా చేశారు.
ప్రకాశ్ సింగ్ బాదల్, చరణ్ జిత్ సింగ్ చన్నీ, నవ జ్యోత్ సింగ్ సిద్దూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ , బిక్రం సింగ్ మజిథియా ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు భగవంత్ మాన్.
Also Read : ఆప్ విజయం ప్రముఖులు పరాజయం