Maharastra Crisis : గవర్నర్ ఆమోదం బీజేపీకి మార్గం సుగమం
షిండే డిప్యూటీ సీఎం..9 మందికి మంత్రి పదవులు
Maharastra Crisis : అధికారం అన్నది ఎంత పవర్ ఫుల్ అన్నది ఇప్పుడు తెలిసొచ్చింది శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు. నిన్నటి దాకా సీఎంగా ఉన్న ఆయన ఇవాళ మాజీ సీఎం అయి పోయారు.
ప్రధానంగా కేంద్రంలో కొలువుతీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్ గా ఉన్న అమిత్ షా ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే అది అమలు జరిగి తీరాల్సిందే. ఆయన ఎక్కడా పల్లెత్తు మాట అనకుండానే పని మొత్తం కానిచ్చేశారు.
ఏ భారత రాజ్యాంగాన్నైతే బాబా సాహెబ్ అంబేద్కర్ రాశాడో దానినే అడ్డం పెట్టుకుని దేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవాళ పవర్ తో పాటు మనీ కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటోంది.
ఇదంతా ఎందుకంటే మొదటి నుంచీ బీజేపీతో ఉన్న శివసేన ఉన్నట్టుండి విడి పోయింది. తన సిద్దాంతాలను వ్యతిరేకించే పార్టీలతో జత కట్టింది. ఆ తర్వాత మహా వికాస్ అఘాడిగా ఏర్పడింది.
రెండున్నర ఏళ్ల పాటు సాగిన పాలన ఒక్కసారిగా కూలి పోయింది. తాను ఎవరినైతే నమ్ముకుందో శివసేన పార్టీ వారి చేతిలోనే మోసానికి గురైంది. ఇది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ చీఫ్ , మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు మార్గం సుగమమైంది(Maharastra Crisis) .
ఆయనే సీఎంగా మరోసారి కొలువు తీరనున్నారు. తిరుగుబాటు ప్రకటించిన షిండే డిప్యూటీ సీఎంగా, ధిక్కార స్వరం ప్రకటించిన ఎమ్మెల్యేలలో 9 మందికి కీలక మంత్రి పదవులు దక్కనున్నాయి.
ఇక సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దీంతో కొంత కాలం పాటు కొనసాగుతూ వచ్చిన సర్కార్ కూలి పోయింది.
Also Read : సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే గుడ్ బై