Abhishek Banerjee : గవర్నర్ ఆదేశం అభిషేక్ ఆగ్రహం
చర్యలు తీసుకోవాలన్న జగదీప్
Abhishek Banerjee : పశ్చిమ బెంగాల్ లో గవర్నర్, సీఎంల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడింది. ఇప్పటికే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ మరింత వేడి రాజేస్తున్నారు.
తాజాగా టీఎంసీ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడిని టార్గెట్ చేశారు రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సీబీఐ దర్యాప్తు నకు ఆదేశించిన న్యాయ స్థానంపై తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ అభిషేక్ బెనర్జీ. దీంతో దీనిని సీరియస్ గా తీసుకున్న గవర్నర్ అభిషేక్(Abhishek Banerjee) పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మండిపడ్డారు.
ఈ మేరకు గవర్నర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు పోలీస్ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేయడం చర్చకు దారి తీసింది. ఈ ఉత్తర్వులను సోమవారం గవర్నర్ జారీ చేశారు.
ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్ట విరుద్దమని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆధీనంలో స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ మెంట్ తో పాటు పలు కేసులపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోల్ కతా హైకోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా న్యాయవ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకరిద్దరు చేతులు కలిపారని, మౌనంగా అవగాహన కలిగి ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు.
అయిన దానికి కాని దానికి ప్రతి కేసులో ప్రత్యేకించి చిన్న కేసులో, ప్రాధాన్యత లేని కేసులకు కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ విషయం బహిరంగంగా చెప్పేందుకు తాను సిగ్గు పడుతున్నట్లు పేర్కొన్నారు అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee). దీనిని ఆధారంగా చేసుకుని గవర్నర్ నోటీసులు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
Also Read : 16 మంది బీజేపీ అభ్యర్థులు డిక్లేర్