Govt Hikes Jute MSP : రైతులకు గుడ్ న్యూస్ ! పంట మద్దతు ధర పెంచిన కేంద్రం

Govt Hikes Jute MSP : కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన చేసింది. పంట కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇక దీనివల్ల అన్నదాతలకు పెద్ద ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. 

ఏకంగా 40 లక్షల మంది రైతులకు ప్రయోజనం ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ చెప్పారు. ముడి జనపనార పంట కనీస మద్దతు ధరను (MSP) పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 

క్వింటాల్‌పై రూ. 300 పెరగ్గా.. 2023-24 సీజన్‌కు సంబంధించి ఈ పంట మద్దతు ధర రూ.5050కి పెరిగినట్లు(Govt Hikes Jute MSP) వెల్లడించింది. అంతకుముందు ముడి జనపనార మద్దతు ధర రూ.4750గా ఉండేది. ఇక ఈ నిర్ణయంతో రైతులకు పంట పెట్టుబడిపై 63 శాతం మేర లబ్ది చేకూరి, 40 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం శుక్రవారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ముడి జనపనార పంట పండించే రైతులు సంతోషంలో ఉన్నారు.

మద్దతు ధర పెంచిన నేపథ్యంలో.. ఇతర పంటలు వేసే వారు కూడా దీనిపై ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది. శుక్రవారం రోజు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. 

ఇక వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ సూచనలు, సిఫార్సుల మేరకు ఈ రా జూట్ మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించినట్లు చెప్పారు అనురాగ్ ఠాకుర్. 

ఇక ఈ నిర్ణయం వల్ల పంట ఉత్పత్తి వ్యయం కంటే 63 శాతం ఎక్కువగా రిటర్న్స్ పొందొచ్చని అన్నారు. ఇదే విధంగా జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) .. ధర మద్దతు కార్యకలాపాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి నోడల్ ఏజెన్సీగా కొనసాగుతుంది. 

ఇలాంటి సందర్భాల్లో రైతులకు ఏదైనా నష్టం సంభవిస్తే.. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రీఎంబర్స్ చేస్తుంది. మరోవైపు.. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీని మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఏటా మొత్తం 12 సిలిండర్ల వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 రాయితీ ఇస్తామని ప్రకటించింది.

Also Read : నన్ను జీవితాంతం అనర్హుడిగా ప్రకటించండి

Leave A Reply

Your Email Id will not be published!