Bhagwant Mann : రైతుల‌కు అండ‌గా పంజాబ్ ప్ర‌భుత్వం – మాన్

పంట వ్య‌ర్థాల తొల‌గింపు బాధ్య‌త మాదే

Bhagwant Mann : పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు త‌మ రాష్ట్రానికి చెందిన రైతుల‌కు అండ‌గా నిలుస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు అధికారికంగా వెల్ల‌డించారు. ప్ర‌భుత్వం అన్న‌దాత‌ల‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం భ‌గ‌వంత్ మాన్ మీడియాతో మాట్లాడారు.

పంట వ్య‌ర్థాల‌ను రైతులు కాల్చి వేస్తుండ‌డంతో ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే కాలుష్యం కార‌ణంగా స్కూళ్ల‌ను మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది ఢిల్లీ స‌ర్కార్. ఈ పంట వ్య‌ర్థ‌ల కాల్చివేత వ్య‌వ‌హారం ప‌లుమార్లు న్యాయ‌స్థానం వ‌ర‌కు వెళ్లింది.

ఈ త‌రుణంలో పంజాబ్ సీఎం చేసిన కామెంట్స్ కీల‌కంగా మారాయి. పంట వ్య‌ర్థాల కాల్చివేత‌కు సంబంధించి నింద‌లు వేయ‌డం, ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann). ప్ర‌భుత్వమే ఈ బాధ్య‌త‌ను తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. కావాల‌ని రైతులు కాల్చ‌డం లేద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో వారికి ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌డం లేద‌న్నారు. దానికి తామే బాధ్య‌త వ‌హిస్తున్నామ‌ని పేర్కొన‌డం విశేషం. వ‌చ్చే సంవ‌త్స‌రం నాటికి పంట వ్య‌ర్థాల కాల్చివేత‌కు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు భ‌గ‌వంత్ మాన్. మ‌రో వైపు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డంలో మాఫియాలు అడ్డు వ‌స్తున్నాయ‌ని అయినా వాటిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌తామ‌ని పేర్కొన్నారు సీఎం భ‌గ‌వంత్ మాన్.

ప్ర‌స్తుతం 40 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వ‌రి పంట వేశార‌ని త్వ‌ర‌లో రైతుల‌తో చ‌ర్చించి పంట మార్పిడికి ప్ర‌య‌త్నాలు చేస్తామ‌న్నారు సీఎం.

Also Read : గుజ‌రాత్ ఎన్నిక‌ల‌పై ‘ట్ర‌బుల్ షూట‌ర్’ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!