Coal Mine Auction : కమర్షియల్ కోల్ మైన్ వేలం 10వ విడత మొదలు పెట్టిన సర్కారు

సింగరేణి సీఎండీ బలరాం, బిడ్డర్లు పాల్గొన్నారు...

Coal Mine Auction : వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియ యొక్క 10వ రౌండ్ వెస్ట్ ఇన్ హోటల్‌లో ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వేలాన్ని ప్రారంభించారు. ఈ వేలానికి బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. సింగరేణి సీఎండీ బలరాం, బిడ్డర్లు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాకులను కేంద్రం వేలం వేసింది.

Coal Mine Auction 10th Round

తెలంగాణలోని శ్రావణపల్లి బొగ్గు గని వేలానికి వచ్చింది. గతంలో శ్రావణపల్లి గనిలో 11.99 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రావణపల్లి బ్లాక్‌ను నేరుగా సింగరేణి సంస్థానంకే అప్పగించాలని డిమాండ్‌ చేశారు. వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొంటుందా? లేదా? దీంతో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలోని శ్రావణ పాలి బ్లాక్‌ను నేరుగా సింగరేణికి అప్పగించాలని భట్టి డిమాండ్ చేశారు.

Also Read : MLA Pocharam : కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!