Graeme Swann : మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది 2021లో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ అంతగా ఆడలేదని పేర్కొన్నాడు.
కానీ ఈసారి జరుగుతున్న ఐపీఎల్ 2022లో మాత్రం అంచనాలకు మించి దుమ్ము రేపుతోందంటూ కితాబు ఇచ్చాడు. గతంలో కంటే ఐదు రెట్లు అద్భుతంగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు.
అన్ని జట్లు ఒకటైతే రాజస్థాన్ రాయల్స్ మాత్రం డిఫరెంట్ గా ఆడుతోందని తెలిపాడు గ్రేమ్ స్వాన్(Graeme Swann). సీజన్ కు ముందు గత ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో పర్ ఫెక్ట్ టీంను ఎంపిక చేసుకుందని ఈ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ ను అభినందించాడు ఈ మాజీ క్రికెటర్.
ప్రత్యేకించి కొత్తగా నియమితుడైన కుమార సంగక్కర కొలువు తీరాక జట్టులో కీలక మార్పులు తీసుకు వచ్చాడని తెలిపాడు. కేరళ స్టార్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ టీం మునుపటి కంటే సూపర్ పర్ ఫార్మెన్స్ ప్రదర్శిస్తోందని తెలిపాడు.
ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు గెలిచి ఒకటి ఓడిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. జట్టు పరంగా చూస్తే ఒకరిని మించి మరొకరు ఆడుతూ జట్టుకు బలాన్ని ఇస్తున్నారంటూ కితాబు ఇచ్చాడు స్వాన్(Graeme Swann).
ఇదిలా ఉండగా మరో మాజీ క్రికెటర్ నిక్ నైట్ కూడా ఆర్ఆర్ ను ప్రశంసించాడు. ఓపెనింగ్ జోష్ బట్లర్ తో స్టార్ట్ చేయడం, అశ్విన్, చహల్ తో బౌలింగ్ చేయించడం, చివరకు సిమ్రోన్ హిట్ మైర్ రావడం ఫినిషింగ్ ఇవ్వడం బాగుందన్నాడు.
Also Read : రమీజ్ రజాపై సల్మాన్ భట్ ఫైర్