YS Jagan Return : ఏపీ సీఎం జగన్ కు ఘన స్వాగతం
దావోస్ టూర్ నుంచి నేరుగా రాష్ట్రానికి
YS Jagan Return : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Return) స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం ) లో పాల్గొన్న అనంతరం నేరుగా స్వదేశానికి చేరుకున్నారు.
ఏపీకి వచ్చిన సీఎంకు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున మంత్రులు, ఉన్నతాధికారులు, ఏపీ డీజీపీ ఆయనకు గ్రాండ్ వెల్ కం చెప్పిన వారిలో ఉన్నారు. ఏపీ సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సైతం దావోస్ వెళ్లిన వారిలో ఉన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఏపీ సీఎం(YS Jagan Return) దావోస్ సదస్సులో ప్రముఖుల్ని కలుసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు, సిఇఓలు, చైర్మన్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలిపారు.
పెట్టుబడులు పెడితే మరింత సపోర్ట్ అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున పెట్టబడులు రాష్ట్రానికి తీసుకు రావడంలో సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి విజయవంతం అయ్యారని చెప్పక తప్పదు.
రూ. 65 వేల కోట్లకు పైగా గౌతమ్ అదానీ గ్రూప్ తో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఇదిలా ఉండగా మంగళవారం గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు సీఎం. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశంలో జగన్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇదే సమయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం పాల్గొన్నారు.
వీరిద్దరూ కలుసుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా తన సోదరుడు జగన్ ను కలుసు కోవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు కేటీఆర్.
Also Read : ఇంధన రంగంలో పెట్టుబడుల వెల్లువ