Himanshu Rao KCR : భారత దేశ చరిత్రలో తనకంటూ ఓ పేజీని స్వంతం చేసుకున్న అరుదైన నాయకుడు. ఉద్యమ నేత. కవి. రచయిత. గాయకుడు. సాహితీ పిపాసకుడు. ఆలోచనా పరుడు.
తత్వవేత్త. పాలసీ మేకర్. భక్తుడు. అద్భుతమైన నైపుణ్యం కలిగిన మేధావి. బహు భాషా కోవిదుడు. అంతకంటే పరిపాలనా దక్షుడుగా పేరొందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
ఆయనను సీఎంగా కంటే ఉద్యమకారుడిగానే కోట్లాది ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఈ జన్మలో రాదని, వచ్చే జన్మలో సైతం సాధ్యం కాదని అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆచరణలో చేసి చూపించిన ఉద్యమ శీలి.
మోస్ట్ పాపులర్ లీడర్ గా వినుతికెక్కిన కేసీఆర్ ఒక్కసారి మాట్లాడటం మొదలు పెట్టాడంటే మీడియా ప్రతినిధులు సైతం విస్తు పోవాల్సిందే. కొత్త పదాలను వాడడంలో, తనదైన శైలిలో స్పందించడం లోనూ ఆయనను మించిన రాజకీయ నాయకుడు,
ముఖ్యమంత్రి ప్రస్తుతం దేశంలో లేరనే చెప్పక తప్పదు. లక్షలాది ప్రజలు ఆరాధించే సీఎం కేసీఆర్ కు మనుమడు హిమాంశురావు (Himanshu Rao )అంటే వల్లమాలిన అభిమానం.
అంతకంటే పంచ ప్రాణం కూడా. ఎవరినైనా ఎమన్నా అన్నా ఊరుకుంటారు కానీ తన మనుమడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. తనయుడు కేటీఆర్ ఉన్నా, కూతురు కవిత అయినప్పటికీ హిమాంశు అంటే చచ్చేంత ఇష్టం.
మనుమడికి కూడా తాతయ్య అంటే పిచ్చి. ఫిబ్రవరి 17తో 67 పూర్తి చేసుకుని 68 లోకి అడుగు పెట్టిన తన తాతయ్య ఆశీర్వాదం తీసుకున్నాడు హిమాంశు రావు(Himanshu Rao ). పక్కనే తండ్రి కేటీఆర్ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా హిమాంశు తన ఆనందాన్ని పంచుకున్నాడు. మీ ఓర్పు, కరుణ, దేశ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం అత్యంత స్ఫూర్తి దాయకమని పేర్కొన్నాడు. ఆ దేవుడు నాకు అందించిన గొప్ప వరం తాతయ్య మీరు అంటూ కొనియాడారు.
Also Read : ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై హైకోర్టు ఫైర్