GT vs CSK IPL 2023 : చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌గ‌జ్జేత‌

5 వికెట్ల తేడాతో గెలుపు

GT vs CSK IPL 2023 : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 16వ సీజ‌న్ క‌థ ముగిసింది. చివ‌ర‌కు విజేత‌గా నిలిచింది మ‌హేంద్ర సింగ్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK). క‌ళ్లు చెదిరే సిక్స‌ర్లు, ఫోర్లు , అద్భుత‌మైన ఫీల్డింగ్ తో ఇరు జ‌ట్లు అల‌రించాయి. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఆస‌క్తిని రేపింది. చివ‌రి బంతి వ‌ర‌కు నువ్వా నేనా అంటూ స‌క్సెస్ దోబూచులాడింది.

ఐపీఎల్ ఛాంపియ‌న్ గా అవ‌త‌రించింది. లీగ్ ఆరంభంలో త‌డ‌బ‌డినా చివ‌ర‌కు నిలిచింది. ప్లే ఆఫ్స్ కు ద‌ర్జాగా చేరుకున్న సీఎస్కే ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడ‌లేదు. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో కొన‌సాగుతూ వ‌చ్చిన డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్(GT) కు చుక్క‌లు చూపించింది. క్వాలిఫైయ‌ర్ -1లో హార్దిక్ పాండ్యా సేనాకు చుక్క‌లు చూపించింది. ఆ త‌ర్వాత ఫైన‌ల్ లో మ‌రోసారి త‌ల‌ప‌డింది.

భారీ వ‌ర్షం అడ్డు ప‌డినా ఆ త‌ర్వాత కీల‌క మ్యాచ్ కొన‌సాగింది. రెండోసారి వాయిదా ప‌డిన ఈ మ్యాచ్ లో మ‌రోసారి వ‌ర్షం అడ్డంకిగా నిలిచింది. చివ‌రికి సీఎస్కేదే పై చేయి అయ్యింది. చివ‌రి రెండు బంతుల్లో 10 ర‌న్స్ కావాల్సి వ‌చ్చింది. దీంతో మైదానంలో ఉన్న జ‌డ్డూ ( ర‌వీంద్ర జడేజా) మ‌రోసారి తన స‌త్తా ఏమిటో చూపించాడు. రియ‌ల్ ఫినిష‌ర్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. 5వ బంతిని సిక్స‌ర్ గా మ‌లిచాడు. 6వ బంతిని ఫోర్ కొట్ట‌డంతో రావాల్సిన ప‌ది ప‌రుగులు వ‌చ్చేశాయి.

Also Read : KTR

Leave A Reply

Your Email Id will not be published!