GT vs LSG IPL 2022 : చెలరేగిన గుజరాత్ చేతులెత్తేసిన లక్నో
62 పరుగుల తేడాతో ఘన విజయం
GT vs LSG IPL 2022 : ఐపీఎల్ 2022లో విజయాలతో దూసుకు పోతూ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య(GT vs LSG IPL 2022) నువ్వా నేనా సాగుతుందని అంతా భావించారు. కానీ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది.
గుజరాత్ టైటాన్స్ మరోసారి రెచ్చి పోయింది. ముంబైతో ఓటమి పాలైన గుజరాత్(GT vs LSG IPL 2022) కసితీరా ఆడింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఓపెనర్ శుభ్ మన్ గిల్ రాణించాడు. హాఫ్ సెంచరీ చేశాడు.
నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసింది. ఇక 145 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్లు చుక్కలు చూపించారు.
ఆరంభంలోనే క్వింటన్ డికాక్ ను 11 పరుగులకు, కెప్టెన్ కేఎల్ రాహుల్ ను 6 పరుగులకే పెవిలియన్ బాట పట్టించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన దీపక్ హూడా ఒక్కడే కాసింత గుజరాత్ బౌలర్లను తట్టుకుని నిలబడ్డాడు.
27 పరుగులు చేశాడు. డికాక్ , హూడా ఇద్దరే రెండంకెల స్కోర్ దాటింది. కరణ్ శర్మ 4, కృనాల్ పాండ్యా 5 , ఆయుష్ బదోనీ 8 , మార్కస్ స్టాయినిస్ 2 , జేసన్ హోల్డర్ ఒక, మోహిసిన్ ఖాన్ 1 చేసి చేతులెత్తేశారు(GT vs LSG IPL 2022).
చివరలో ఆవేష్ ఖాన్ 12 రన్స్ చేసినా ఫలితం లేక పోయింది. దాంతో 82 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు తీస్తే , సాయి కిషోర్ , యశ్ దయాళ్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీ రాహుల్ ను బోల్తా కొట్టించాడు.
Also Read : తగ్గేదే లేదంటున్న నేపాల్ బౌలర్