Gudivada Amarnath : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి
ఏపీ ఐటీ శాఖ మంత్రి అమర్ నాథ్
Gudivada Amarnath : అమరావతి – విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించు కోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్. రాజమండ్రి ఎయిర్ పోర్టు అభివృద్దికి రూ. 347 కోట్లు కేటాయించడమే కాకుండా శంకుస్థాపన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
Gudivada Amarnath Comment about Steel Plant
రాజమండ్రి ఎయిర్ పోర్టును ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా మార్చేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఏపీ మంత్రి. రాష్ట్రంలోని ఆరు ఎయిర్ పోర్టు ల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు.
త్వరలో భోగాపురం ఎయిర్ పోర్టును కూడా ప్రారంభోత్సవం చేస్తారని చెప్పారు గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath). ఆదివారం ఆయన మీడియా మాట్లాడారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రులు హక్కుగా భావిస్తారని , ఏ మాత్రం వ్యతిరేక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయన్న అభిప్రాయం వచ్చేలా కామెంట్ చేశారు.
తమ ప్రభుత్వం అందుకు ఒప్పుకోదన్నారు. ఇప్పటికే తమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం జరిగిందన్నారు.
Also Read : AB De Villiers : శాంసన్ అద్భుతమైన ఆటగాడు