Gudivada Amarnath Pawan : ప‌వ‌న్ కామెంట్స్ గుడివాడ సీరియ‌స్

వాలంటీర్ల‌పై నోరు పారేసుకుంటే ఎలా

Gudivada Amarnath Pawan : ఏపీలో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాలంటీర్ల వ్య‌వ‌స్థ గురించి ప్ర‌శ్నించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్. దీనిపై ప్ర‌శ్నించే నైతిక హ‌క్కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు లేద‌న్నారు.

Gudivada Amarnath Pawan Discussion

శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీ మంత్రి. రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పోటీ ప‌డుతూ వాలంటీర్లు ప‌ని చేస్తున్నార‌ని కితాబు ఇచ్చారు. వారు స్వ‌చ్చంధంగా సేవ‌లు అందిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌జ‌ల‌కు పెన్ష‌న్లు, ఇత‌ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు సంబంధించి స‌హాయం చేస్తున్నార‌ని తెలిపారు.

అవ‌స‌ర‌మైన ప్ర‌భుత్వ స‌ర్టిఫికెట్లు అంద‌జేస్తున్నార‌ని, కరోనా క‌ష్ట కాలంలో ప్రాణాల‌కు తెగించి వాలంటీర్లు విధులు నిర్వ‌హించార‌ని, అలాంటి వారి ప‌ట్ల ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) చుల‌క‌న‌గా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు గుడివాడ అమ‌ర్నాథ్.

వాలంటీర్ల‌కు బాస్ ఎవ‌రో నీకు తెలియ‌దా ప‌వ‌న్ అంటూ మండిప‌డ్డారు. ఎవ‌రు చెబితే ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేస్తున్నారో అర్థం చేసుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. నింద‌లు మోయ‌డం ఇక నుంచైనా మానుకోవాలని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

Also Read : Google AI Journalists : జ‌ర్న‌లిస్టుల కోసం గూగుల్ ఏఐ

Leave A Reply

Your Email Id will not be published!