Gudivada Amarnath : ఎన్నికల వేళ ఏపీపై విమర్శలేల
ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్
Gudivada Amarnath : తిరుమల – ఎన్నికలు వస్తున్నాయంటే చాలు బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ మంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath) . ఇది మంచి పద్దతి కాదన్నారు.
Gudivada Amarnath Comments BRS Govt
తిరుమలను సందర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తాము ఎవరినీ విమర్శించడం లేదని పేర్కొన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడటం మీకు మాత్రమే చెల్లిందన్నారు. రాజకీయాలలో ఆరోపణలు, విమర్శలు చేయడం సహజమేనని కానీ వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచి పద్దతి కాదని హితవు పలికారు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఇవాళ యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని చెప్పారు. కారణం తాము ప్రవేశ పెట్టిన నాడు నేడు కార్యక్రమం, వాలంటీర్ల వ్యవస్థ అని అన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని స్పష్టం చేశారు ఏపీ ఐటీ మంత్రి.
ఒకటో తారీఖునే లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని ఇలాంటి రాష్ట్రం ఎక్కడా లేదన్నారు. ఇకనైనా తమ రాష్ట్రంలో జరిగిన అభివృద్ది గురించి చెబితే బావుంటుందని బీఆర్ఎస్ నేతలకు సూచించారు గుడివాడ అమర్నాథ్.
Also Read : Partys Manifestos Comment : ఎన్నికలు సరే జనం ఎజెండా ఏది