Gudivada Amarnath : రామోజీ రావు దుర్మార్గుడు – అమర్‌నాథ్
ఐటీ శాఖ మంత్రి సంచలన కామెంట్స్
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ – ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావుపై నిప్పులు చెరిగారు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేకుండా తప్పుడు రాతలు రాస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ధ్వజమెత్తారు. ఎన్ఆర్ఏలే ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు మంత్రి.
Gudivada Amarnath Slams Ramoji Rao
మీ ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయని, రాజకీయ అవసరాలకు మాత్రం ఆంధ్రాను వాడుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి అవినీతి సామ్రాజ్యం కోసం ఉత్తరాంధ్రపై విషం కక్కుతారా అంటూ ప్రశ్నించారు.
ఈనాడు పుట్టిన విశాఖపై రోజూ విషపు రాతలు రాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే దుర్మార్గుడు రామోజీ రావు అని మండిపడ్డారు గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath). చంద్రబాబు నాయుడు తప్పు చేశారు కాబట్టే రాజమండ్రి జైలులో ఉన్నారని అన్నారు. అందరి ఖైదీల లాంటి వ్యక్తి అని , స్పెషల్ గా ట్రీట్ మెంట్ అంటూ ఉండదన్నారు .
సీఎంఓ, కార్యాలయాల ఏర్పాటుపై సీఎం జగన్ రెడ్డి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . రామోజీ రావు, చంద్రబాబు నాయుడు కలిసి అమరావతి అనే కలల రాజధానిని నిర్మించుకున్నారని జగన్ దానిని బట్ట బయలు చేశారని, దీంతో తట్టుకోలేక తప్పుడు రాతలు రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : AP CM YS Jagan : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా