Gudivada Amarnath : తప్పు చేసి దాడులు చేస్తే ఎలా
ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ – ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను తట్టుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. పనిగట్టుకుని ఏమీ చేత కాక కులాన్ని ముందు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
Gudivada Amarnath Slams TDP
ఇదే సమయంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన సహచర మంత్రి అంబటి రాంబాబుపై కావాలని దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath). వ్యక్తిగతంగా దూషించడం, దాడులు చేయడం పనిగా పెట్టుకున్నరాంటూ ధ్వజమెత్తారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
గతంలో చంద్రబాబు హయాంలో కాపు నేత ముద్రగడ పద్మనాభంపై కూడా ఇదే పచ్చ బ్యాచ్ దాడికి పాల్పడ్డారంటూ గుర్తు చేశారు మంత్రి. ఏపీ స్కిల్ స్కాంలో రూ. 371 కోట్ల స్కాం జరిగిన కేసులో అడ్డంగా చంద్రబాబు నాయుడు బుక్ అయ్యారంటూ ఆరోపించారు.
ఇక పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉందన్నారు. దీనిని ప్రజలు గమనించాలని ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. ఇకనైనా టీడీపీ శ్రేణులు తమ తీరును మార్చు కోవాలని సూచించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read : Harish Rao : విష్ణుకు హరీశ్ రావు ఆఫర్