Gujarat Congress : ఎమ్మెల్యేలు జారి పోకుండా కాంగ్రెస్ ఫోకస్
ఉత్కంఠ భరితంగా రాజ్యసభ ఎన్నికలు
Gujarat Congress : రాజస్తాన్ లో రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మారాయి. ఇక్కడ మీడియా మొఘల్ ఎస్సెల్ గ్రూప్ సంస్థల చైర్మన్ జీ సుభాష్ చంద్ర ఊహించని రీతిలో ట్విస్ట్ చేశారు.
ఆయన స్వతంత్ర అభ్యర్థిగా సుభాష్ చంద్ర బరిలో నిలిచారు. ఆయనకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు
ఇక్కడ పోటీ కీలకంగా మారింది.
నాల్గో స్థానంపై పోటీ తీవ్రంగా నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 200 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ పార్టీకి 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈనెల 10న రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో తమ అభ్యర్థులను గెలిపించు కోవడంలో భాగంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జారి పోకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతోంది. వారందరినీ రహస్య ప్రదేశాలకు (రిసార్ట్స్ ) తరలించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వీరందరిని ఉదయ్ పూర్ లోని రిసార్ట్ కు తరలించే చాన్స్ ఉంది. ఇక్కడే ఇటీవల కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు నవ్ సంకల్ప్ చింతన్ శివర్ నిర్వహించింది. పలు తీర్మానాలు చేసింది.
కాగా బలమైన బీజేపీ మద్దతు ఉన్న మీడియా కింగ్ సుభాష్ చంద్ర పోటీలో నిలవడం ఇక్కడ ఉత్కంఠను రాజేసింది. ఇది కాంగ్రెస్(Gujarat Congress) మూడో సీటును గెలుచుకునే అవకాశాలను దెబ్బ తీస్తుందని భయ పడుతోంది.
సుభాష్ చంద్ర ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేసిన తర్వాత మూడో అభ్యర్థిని ఎన్నుకునేందుకు మరో 15
ఓట్లు అవసరం అవుతాయి కాంగ్రెస్ పార్టీకి(Gujarat Congress). ఇక బీజేపీకి ఒక అభ్యర్థిని ఎన్నుకుంటుంది.
కాన రెండో అభ్యర్థికి 11 ఓట్లు కావాల్సి ఉంటుంది. రాజస్తాన్ అసెంబ్లీలో 13 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది చిన్న
పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు.
కాంగ్రెస్ కు 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాగా రాజస్తాన్ నుంచి ముకుల్ వాస్నిక్ , రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా, ప్రమోద్
తివారీలను బరిలోకి దింపింది.
Also Read : మోదీ సారథ్యంలో సాధారణ సైనికుడిని