Gujarat Cuts Vat : ఎన్నికల వేళ గుజరాత్ లో వ్యాట్ తగ్గింపు
సీఎన్జీ, వంట గ్యాస్ పై తగ్గింపుతో కోట్ల భారం
Gujarat Cuts Vat : గుజరాత్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 27 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడే సీఎంగా మోదీ కొలువు తీరారు. అక్కడి నుంచి ప్రధానమంత్రి పదవికి ఎదిగారు. ఈ ఎన్నికలు ప్రధానికి పెను సవాల్ గా మారాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరగనుంది. ఊహించని రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదరణ పెరుగుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం తమకు ఢోకా లేదంటోంది. ఇదిలా ఉండగా ఇప్పటి నుంచే ఎన్నికల తాయిలాలు ప్రకటించే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తేదీని డిక్లేర్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కానీ గుజరాత్ కు(Gujarat Cuts Vat) సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకటించాల్సి ఉండగా వాయిదా వేసింది. దీని వెనుక కేంద్రం కుట్ర దాగి ఉందంటూ ఆప్ ఆరోపించింది. ఆప్ ను చూసి రాష్ట్ర సర్కార్ భయపడుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఇదిలా ఉండగా ఓటమి భయంతోనే వ్యాట్ తగ్గించిందంటూ మండిపడ్డారు. కాగా ఎన్నికలకు ముందు రాష్ట్ర సర్కార్ సీఎన్జీ, పైప్డ్ వంట గ్యాస్ ధరలపై వ్యాట్ ను 10 శాతం తగ్గించింది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు అందించాలని నిర్ణయించింది. దీని వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 650 కోట్లు ఖర్చవుతుంది.
దీపావళి పండుగ కానుక ఇస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. గ్యాస్ కనెక్షన్లు పొందిన 38 లక్షల మంది లబ్దిదారులకు ప్రతి సంవత్సరం రెంవడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. సీఎన్జీ, పీఎన్జీ, ఎల్పీజీ పై వ్యాట్ తగ్గింపు వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,650 కోట్ల భారం పడనుంది.
Also Read : జైన్..సిసోడియాలు భగత్ సింగ్ కాలేరు