Gujarat Titans Champions : అద్భుత విజయం సమిష్టి ఫలితం
శ్రమిస్తే సక్సెస్ స్వంతం వాస్తవం
Gujarat Titans Champions : ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన లీగ్ టోర్నీలలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) టాప్ లో నిలిచింది.
ప్రతి ఏటా అంతకంతకూ ఆదరణ చూరగొంటోంది. కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తోంది. ఇక ఐపీఎల్ 2022 మెగా రిచ్ లీగ్ పండగ ముగిసింది. రెండు నెలలకు పైగా సాగింది ఈ లీగ్.
మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. ఇప్పటి వరకు 15 సీజన్లు ముగిశాయి. 14 సీజన్లలో 8 జట్లు ఆడితే ఈసారి ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు చేరాయి.
అవి గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్. ఎలాంటి అంచనాలు లేకుండానే గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగింది. కానీ ఊహించని రీతిలో సమిష్టిగా రాణించింది.
అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటింది. తానే అసలైన సిసలైన విజేతనని నిరూపించింది. విజయం సాధించాలంటే అదృష్టం అక్కర్లేదని కలిసికట్టుగా పట్టుదలతో ఆడితే గెలుపు తథ్యమని కళ్లారా చేసి చూపించాడు గుజరాత్ టైటాన్స్ జట్టు(Gujarat Titans Champions) స్కిప్పర్ హార్దిక్ పాండ్యా.
ఎన్ని విజయాలు సాధించినా తాను పొంగి పోనంటూ పేర్కొన్నాడు. ఆ జట్టులో ప్రతి ఒక్కరినీ మ్యాచ్ విన్నర్లుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాడు మాజీ భారత క్రికెటర్ , స్టార్ బౌలర్ గా పేరొందిన ఆశిష్ నెహ్రా.
ఈ గెలుపులో మేనేజ్ మెంట్ సపోర్ట్ ఒకటైతే పాండ్యా నాయకుడిగా ముందుండి నడిపించాడు. కోచ్ గా సక్సెస్ అంటే ఏమిటో చూపించాడు.
Also Read : గుజరాత్ జైత్రయాత్ర ఐపీఎల్ జగజ్జేత