Guvvala Balaraju : అచ్చంపేట – బీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గువ్వల బాల రాజుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ అనుచరులతో దాడికి దిగారు. ఈ ఘటన కలకలం రేపింది. దీంతో బాలరాజు ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అచ్చంపేటలో. మెరుగైన వైద్యం కోసం గువ్వల బాల రాజును హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. దీంతో పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు.
Guvvala Balaraju Viral with Injuries
ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ప్రచారం ముగించుకుని వెళుతుండగా కాంగ్రెస్ శ్రేణులు ఎదురు వెళ్లారు. ఇదే సమయంలో వంశీకృష్ణ గుంపులోంచి ఒకరు రాయి విసిరారు. బలమైన గాయమైంది. ఇదిలా ఉండగా వంశీ కృష్ణనే రాయితో దాడి చేశారంటూ ఎమ్మెల్యే గువ్వల బాల రాజు(Guvvala Balaraju) ఆరోపించారు.
తీవ్రంగా గాయ పడిన ఎమ్మెల్యేను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నగరానికి తీసుకు వచ్చారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు గువ్వల బాల రాజు అనుచరులు.
Also Read : Tula Uma : కారెక్కనున్న తుల ఉమ..?