GVL Narasimha Rao Kanna : కన్నా ‘అబద్దం’ సోమూ ‘నిజం – జీవీఎల్
రాజకీయ దురుద్దేశంతోనే కామెంట్స్
GVL Narasimha Rao Kanna : ఏపీలోని భారతీయ జనతా పార్టీలో మాజీ చీఫ్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం కలకలం రేపింది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కన్నా వెళుతూ ప్రస్తుత చీఫ్ సోమూ వీర్రాజు పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన తీరు వల్లనే తాను పార్టీ నుంచి వీడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిలో పనిగా దేశంలో పార్టీ తీరు బాగున్నా ఏపీలో అధ్వాన్నంగా ఉందని మండిపడ్డారు. దీనికి ప్రధాన కారణం ఏవీల్ ,సోమూ వీర్రాజు అంటూ సంచలన ఆరోపణలు చేశారు కన్నా లక్ష్మీ నారాయణ.
దీంతో మొదట్లో మాట్లాడేందుకు ఇష్ట పడని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తాజాగా స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీ నారాయణ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. సోమూ వీర్రాజుపై చేసిన విమర్శలు అర్థరహితమని పేర్కొన్నారు.
ఎవరి ప్రయోజనాల కోసం తాను రాజీనామా చేశారో చెప్పాలన్నారు. బీజేపీలో వ్యక్తులకు ప్రాధాన్యత ఉండదన్నారు. కేవలం పార్టీ కోసం పని చేసిన వారికే ప్రయారిటీ ఉంటుందని స్పష్టం చేశారు జీవీఎల్(GVL Narasimha Rao Kanna).
పార్టీ ముఖ్యమని ఎవరు వెళ్లినా పార్టీకి ఏమీ కాదన్నారు. సోమూ వీర్రాజు తన స్వంత నిర్ణయాలు తీసుకోరని , కేవలం పార్టీ హైకమాండ్ ఏం ఆదేశిస్తే ఆయన అదే చేస్తారని ఇదే సమయంలో పార్టీని నడిపిస్తారని వ్యక్తిగత ద్వేషంతో ఇలాంటి కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదన్నారు జీవీఎల్ నరసింహారావు.
ఎవరు ఏమిటనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని , రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కన్నా లక్ష్మీ నారాయణకు హితవు పలికారు.
Also Read : సోము వల్లే రాజీనామా – కన్నా