Gyanvapi Survey : జ్ఞాన్వాపి మ‌సీదు స‌ర్వేకు 2 రోజులు గ‌డువు

స్ప‌ష్టం చేసిన వార‌ణాసి స్పెష‌ల్ కోర్టు

Gyanvapi Survey : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన జ్ఞాన్ వాపి మ‌సీదు స‌ర్వేకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఇందుకు సంబంధించి స‌ర్వే నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించేందుకు 2 రోజుల గ‌డువు విధించింది వార‌ణాసి సిటీ సివిల్ కోర్టు.

ప్ర‌త్యేక న్యాయ‌వాది క‌మిష‌న‌ర్ విశాల్ సింగ్ నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించ‌నున్నారు. వార‌ణాసి లోని జ్ఞాన్ వాపి మ‌సీదు(Gyanvapi Survey) స‌ముదాయంపై కొంద‌రు హిందువులు పూజా హ‌క్కులు పొందార‌ని స‌ర్వే నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని కోరినందున స్థానిక కోర్టు మంగ‌ళవారం గ‌డువు ఇచ్చేందుకు అనుమ‌తి ఇచ్చింది. కాగా

అడ్వ‌కేట్ క‌మిష‌న‌ర్ అజ‌య్ కుమార్ మిశ్రాను కోర్టు ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించింది. మ‌రో రెండు రోజుల్లో ప్ర‌త్యేక న్యాయ‌వాది క‌మిష‌న‌ర్ విశాల్ సింగ్ ఈ నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది కోర్టు.

అసిస్టెంట్ అడ్వ‌కేట్ క‌మిష‌న‌ర్ అజ‌య్ ప్ర‌తాప్ సింగ్ వెంట ఉంటారు. ఇదిలా ఉండ‌గా మిశ్రాతో పాటు ఉన్న కెమెరా ప‌ర్స‌న్ ల‌లో ఒక‌రు జ్ఞాన్ వాపి మ‌సీదు స‌ర్వే(Gyanvapi Survey)కు సంబంధించిన వివ‌రాల‌ను గోప్యంగా ఉంచాల్సింది పోయి మీడియాకు లీక్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

అత‌డిని వెంట‌నే తొల‌గించారు. అంత‌కు ముందు రోజు జ్ఞాన్ వాపి మ‌సీదు స‌ముదాయం వీడియోగ్ర‌ఫీ స‌ర్వేతో బాధ్య‌త వ‌హించిన క‌మిష‌న్ తుది నివేదిక‌ను త‌యారు చేయ‌లేదు.

దీంతో అద‌న‌పు స‌మ‌యం కావాల‌ని కోరింది. రెండు రోజుల్లో రిపోర్టు స‌మ‌ర్పించాల‌ని ప్యానెల్ ను కోర్టు గ‌తంలో కోరింది. స్థానిక కోర్టు మ‌సీదు కాంప్లెక్స్ లోప‌ల ఒక చెరువును మూసి వేయాల‌ని ఆదేశించింది.

హిందూ పిటిష‌న‌ర్ల త‌ర‌పున న్యాయ‌వాదులు కోర్టు నిర్దేశించిన వీడియోగ్ర‌ఫీ స‌ర్వేలో అక్క‌డ శివ‌లింగం క‌నిపించిందంటూ చెప్పారు కోర్టుకు.

Also Read : టెలికాం రంగంలో ఇండియా దూకుడు

Leave A Reply

Your Email Id will not be published!