Gyanvapi Survey : కట్టుదిట్టంగా జ్ఞాన్ వాపి మసీదు సర్వే
భారీ భద్రత మధ్య ముగిసిన తతంగం
Gyanvapi Survey : ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు సముదాయంలోని మూడు రోజుల వీడియోగ్రపీ సర్వే(Gyanvapi Survey) కోర్టులో తదుపరి విచారణకు ఒక రోజు ముందు ముగిసింది. కాంప్లెక్స్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత, ఆంక్షల మధ్య చిత్రీకరణ చివరి రోజు ఈ ఉదయం ప్రారంభమైంది.
సోమవారం సర్వే కమిషన్ తన పనిని పూర్తి చేసింది. అన్ని ప్రదేశాలను వివరంగా చిత్రీకరించింది. మూడు గోపురాలు, భూగర్భ నేలమాళిగలు, చెరువు , తదితర వాటినన్నింటిని వీడియో రికార్డు చేశారు.
న్యాయవాది , కమిషనర్ మంగళవారం కోర్టులో తన నివేదికను సమర్పించనున్నారు. ఇవాళ గనుక ముగ్గురు కమిషన్ సభ్యులు, నివేదికను సకాలంలో పూర్తి చేయక పోతే తాము కోర్టును మరింత సమయం ఇవ్వమని కోరుతామని పేర్కొన్నారు ప్రభుత్వ న్యాయవాది మహేంద్ర ప్రసాద్ పాండే.
మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. జ్ఞాన్ వాపి మసీదు సర్వే(Gyanvapi Survey) వివరాలను కమిషన్ లోని ఏ సభ్యుడు వెల్లడించ లేదని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ వెల్లడించారు. సర్వేకు సంబంధించిన సమాచారానికి కోర్టు సంరక్షకునిగా ఉంది.
ఈ మసీదు ఐకానిక్ కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉంది. దాని వెలుపలి గోడలపై ఉన్న విగ్రహాల ముందు రోజూ వారీగా ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మహిళల బృందం కోర్టును ఆశ్రయించింది.
ఈ మేరకు వారణాసి సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. ఇందులో ఐదుగురు హిందూ మహిళలు ఉన్నారు. ఏడాది పొడవునా ప్రార్థన చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
కాగా ఏడాదిలో కేవలం ఒకేసారి దర్శించుకునేందుకు మాత్రమే పర్మిషన్ ఉంది. దీంతో కోర్టు పూర్తిగా సర్వే కోసం ఆదేశించింది.
Also Read : నోరు పారేసుకున్న ఆర్బీఐ మెంబర్