HACA Selected : కేంద్ర నోడ‌ల్ ఏజెన్సీగా హాకా

తెలంగాణ స‌ర్కార్ ప‌నితీరుకు ప‌ట్టం

HACA Selected  : తెలంగాణ – రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్(KCR) స‌ర్కార్ తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఉత్త‌మ గ్రామ పంచాయ‌తీలుగా ప‌లు అవార్డులు ద‌క్కాయి. డిజిట‌ల్ మీడియా ప‌రంగా ఇటీవ‌లే పుర‌స్కారం ద‌క్కింది.

తాజాగా తెలంగాణకు చెందిన హైద‌రాబాద్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ కో ఆప‌రేటివ్ అసోసియేష‌న్ లిమిటెడ్ (హాకా) కు సంబంధించి త‌యారు చేసే కంది ప‌ప్పుకు భారీ డిమాండ్ ఉంటోంది. కేంద్ర ప్ర‌భుత్వం హాకాను నోడ‌ల్ ఏజెన్సీగా ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల హాకా నుంచి త‌యారయ్యే ఉత్ప‌త్తులు దేశ వ్యాప్తంగా అమ్ముకునే వీలు క‌లుగుతుంది. దీని వ‌ల్ల అద‌న‌పు ఆదాయం స‌మ‌కూరుతుంది.

HACA Selected National Wise

తెలంగాణ ప‌ప్పును 18 రాష్ట్రాల్లోని 180 న‌గ‌రాల‌లో హాకా విక్ర‌యించ‌నుంది. బెంగాల్ గ్రాము మార్కెట్ ధ‌ర రూ. 90 కిలో ఉండ‌గా హాకా మాత్రం కేవ‌లం రూ. 60 రూపాయ‌ల‌కే ఇస్తోంది. ఈ తెలంగాణ ప‌ప్పు డీ మార్ట్ , స్విగ్గీ , జొమాటో , చిన్న దుకాణాల‌లో కూడా అందుబాటులో ఉండేలా చూస్తోంది.

అంతే కాదు 30 కేజీల బ‌స్తాను త‌గ్గించి కూడా ఇస్తున్నారు. ఆస్ప‌త్రులు, జైళ్లు, క్యాంటీన్లు, దేవాల‌యాల‌కు రూ. 55 కేజీ చొప్పున ఇస్తోంది హాకా. జాతీయ స్థాయిలో వ్యాపారం చేసేందుకు కేంద్ర స‌ర్కార్ నోడ‌ల్ ఏజెన్సీగా హాకా ఎంపికైంది.

Also Read : CM KCR : అంగన్‌వాడీ టీచర్లకు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!