Saudi Airlines: హజ్ యాత్రికుల విమానానికి తప్పిన పెను ప్రమాదం
హజ్ యాత్రికుల విమానానికి తప్పిన పెను ప్రమాదం
Saudi Airlines : హజ్ యాత్రికులతో లఖ్‌నవూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సౌదీ అరేబియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. 250 మంది హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరిన సౌదీ ఎయిర్‌లైన్స్ (Saudi Airlines) విమానం ఆదివారం ఉదయం లఖ్‌నవూలోని అమౌసి విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత… టాక్సీ మార్గంలో వెళుతుండగా విమానం ఎడమ టైర్ నుంచి నిప్పురవ్వలు రావడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీనితో అప్రమత్తమైన పైలట్లు… ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పారని తెలిపారు. అనంతరం ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Saudi Airlines Miss
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం SV 3112 శనివారం రాత్రి 11:30 గంటలకు సౌదీలోని జెడ్డా విమానాశ్రయం నుంచి 250 మంది హజ్ యాత్రికులతో బయలుదేరింది. ఆదివారం ఉదయం 6:30 గంటలకు లఖ్‌నవూలోని అమౌసి విమానాశ్రయానికి చేరుకుంది. రన్‌వేపై దిగిన తర్వాత, విమానం టాక్సీవే పైకి వస్తుండగా దాని ఎడమ చక్రం నుంచి మంటలు, పొగ రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు దాదాపు 20 నిమిషాలు శ్రమించి మంటలను ఆర్పారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించినట్లు అధికారులు పేర్కొన్నారు. సాంకేతికలోపం కారణంగా విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ చక్రం పనిచేయకపోవడంతో మంటలు వచ్చాయని తెలిపారు.
Also Read : Air India : హడలెత్తిస్తున్న ఎయిరిండియా విమానాలు
