Chandrayan-3 Launch : నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3
40 రోజుల పాటు వెయిటింగ్
Chandrayan-3 Launch : యావత్ భారత దేశ ప్రజల ఆశలను మోసుకొస్తూ చంద్రయాన్ -3 ఏపీలోని శ్రీహరి కోట నుండి శుక్రవారం సరిగ్గా 2.53 నిమిషాలకు నింగిలోకి దూసుకు వెళ్లింది. ఈ మిషన్ గనుక సక్సెస్ అయితే రష్యా, చైనా, అమెరికా తర్వాత భారత్ చంద్రుని వద్దకు వెళ్లిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టిస్తుంది.
చంద్రయాన్ -3కి మరో పేరు కూడా పెట్టారు బాహుబలి రాకెట్ అని. ఇక భూమి నుండి చంద్రుడి వద్దకు ప్రయాణం దాదాపు నెల రోజుల పాటు పడుతుందని అంచనా. ఆగస్టు 23న ల్యాండింగ్ అవుతుందని ఇస్రో తెలిపింది. ఒక రోజు అంటే 14 రోజులకు సమానం.
చంద్రయాన్ -3(Chandrayan-3) మూడు ప్రధాన భాగాలను కలిగి ఉంది. ల్యాండర్ , రోవర్, ప్రోపల్షన్ మాడల్ . చంద్రయాన్ -2 నుండి ఆర్బిటర్ ను ఉపయోగిస్తుంది చంద్రయాన్ -3 . 2008లో చంద్రుడిని కనుగొన్నట్లు ఇస్రో ప్రకటించింది. యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది.
చంద్రయాన్ -3 తొలి ప్రయోగం సక్సెస్ అయ్యింది. యావత్ భారత్ తో పాటు ప్రపంచమంతా దీనిపై ఉత్కంఠ తో ఎదురు చూశారు. ప్రస్తుతం ఫ్రాన్స్ టూర్ లో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దీని కోసం వేచి చూశారు.
Also Read : Maaveeran Movie : అదితి..శివ ‘మావీరన్’ కు ఆదరణ