Harbhajan Singh : ఓహ్ ఇది చరిత్రలో చిరస్థాయిలో నిలిచి పోయే సన్నివేశం. మిత్రమా నువ్వు ఓ అద్భుతమైన చరిత్రకు దర్పణంగా నిలిచావు అంటూ ప్రముఖ భారత క్రికెట్ జట్టు ఆటగాడు హర్బజన్ సింగ్ (Harbhajan Singh )కితాబు ఇచ్చాడు.
ఇవాళ అత్యధిక స్థానాలు గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీని, ఆ పార్టీకి చెందిన సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ను ప్రత్యేకంగా అభినందించాడు భజ్జీ. రాష్ట్రంలో మొత్తం 117 సీట్లకు గాను ఆప్ 92 స్థానాలలో సామాన్యుడి జెండా ఎగుర వేసింది.
కాంగ్రెస్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ శిరోమణి అకాలీ దళ్ , బీజేపీ పార్టీలకు చుక్కులు చూపించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. 1997 తర్వాత సాడ్ , బీజేపీ కలిసి సాధించిన అతి పెద్ద సంఖ్యను ఆప్ ఛేదించింది.
ఒక రకంగా చరిత్ర సృష్టించింది. ఈ తరుణంలో సీఎం అభ్యర్థి మాన్ ధురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కొత్త సీఎంగా పంజాబ్ రాష్ట్రంలోని నవాన్ షహర్ జిల్లా లోని సర్దార్ షహీద్ భగత్ సింగ్ పుట్టిన ఖట్కర్ కలన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ తరుణంలో ఆప్యాయంగా భగవత్ మాన్ తన తల్లిని ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫోటోను షేర్ చేశాడు హర్భజన్ సింగ్. కొత్తగా సీఎం కాబోతున్నందుకు , నా సహచరుడు భగవంత్ మాన్ కు ప్రత్యేక, హృదయపూర్వక అభినందనలు.
భగత్ సింగ్ గ్రామంలో ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప ఆలోచన. ఈ విషయం వినడంతో నా హృదయం పులకించి పోయింది మాన్. ఇది మాతాజీకి గర్వ కారణం అని పేర్కొన్నాడు భజ్జీ. మార్పును కోరుకున్న ప్రజలను అభినందించాడు.
Also Read : ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం