Harbhajan Singh : జైస్వాల్..రింకూను జట్టులోకి తీసుకోండి
బీసీసీఐకి హర్భజన్ సింగ్ సూచన
Harbhajan Singh : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ , ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెంటనే ఐపీఎల్ 16వ సీజన్ లో తమ అద్బుతమైన ఆట తీరుతో రాణిస్తున్న, పరుగుల వరద పారిస్తున్న రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ , కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ ను టీమిండియాలోకి తీసుకోవాలని సూచించాడు.
ఇప్పటికే జట్టులో సమతుల్యత లోపించిందన్నాడు. లేక పోతే రెండో జట్టు గా ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడు. గత కొంత కాలంగా బీసీసీఐ అనుసరిస్తున్న ఎంపిక పద్దతిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అసాదారణమైన ఆట తీరుతో జైస్వాల్ రాణిస్తుండగా మ్యాచ్ ఫినిషర్ గా రింకూ సింగ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడని ఇలాంటి యువ రక్తంతో నిండిన ఆటగాళ్లు జట్టుకు చాలా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశాడు హర్భజన్ సింగ్. ఆ ఇద్దరి అవసరం ఇప్పుడు టీమిండియాకు ఎంతో ఉందన్నాడు భజ్జీ.
ఫామ్ లో కొనసాగుతున్న సమయంలోనే ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోవాలన్నాడు. తాను ఎంపికను తప్పు పట్టడం లేదని కానీ ఉన్న వారిలో ఎంపిక చేస్తే అది జట్టుకు మరింత ప్రయోజనకారిగా ఉంటుందని స్పష్టం చేశాడు భారత మాజీ క్రికెటర్. ప్రస్తుతం భజ్జీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : AP CM YS Jagan