Hardik Pandya : ఐపీఎల్ 2022లో జోష్ మీదున్న రాజస్థాన్ రాయల్స్ కు చుక్కలు చూపించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya). ఓ దశలో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మైదానంలోకి వచ్చిన పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
గుజరాత్ టైటాన్స్ మేనేజ్ మెంట్ ఎందుకు తనకు కెప్టెన్సీ అప్పగించిందో క్రీజులో చేసి చూపించాడు. తనదైన శైలిలో రాణించాడు. అంతేనా అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శించాడు.
అటు బ్యాటింగ్ లో దుమ్ము రేపాడు. ఇటు బౌలింగ్ లో సత్తా చాటాడు. నాయకుడిగా ముందుండి నడిపించాడు. అద్భుతమైన బంతితో రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ను రనౌట్ తో షాక్ ఇచ్చాడు.
ఇది ఓవర్ ఆల్ గా జరిగిన లీగ్ మ్యాచ్. ఈ ఆట పూర్తిగా హార్దిక్ పాండ్యాదేనని(Hardik Pandya) చెప్పక తప్పదు. ఆద్యంతమూ రసవత్తరంగా సాగుతుందన్న మ్యాచ్ చివరకు పేలవంగా ముగిసింది.
నిన్నటి దాకా పులుల్లా ఆడిన రాజస్థాన్ ఆటగాళ్లు అత్యంత దారుణమైన చెత్త ప్రదర్శనతో చేజేతులారా చేతులెత్తేశారు. ఆ జట్టులో కేవలం జోస్ బట్లర్ ఒక్కడే మెరిశాడు.
మరోసారి సత్తా చాటాడు. ఇక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న తన టీమ్ ను గెలపించాల్సిన సంజూ శాంసన్ లేని పరుగు కోసం పోయి ఉన్న వికెట్ ను పారేసుకున్నాడు.
ఈ విక్టరీ పూర్తిగా పాండ్యాదే. 87 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తాను సరైనోడినేనని నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఏది ఏమైనా శాంసన్ పాండ్యాను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
Also Read : పుజారా..రిజ్వాన్ అరుదైన కలయిక