Hardik Patel : కాంగ్రెస్ కంటే బీజేపీ బెట‌ర్

హార్దిక్ ప‌టేల్ సంచ‌ల‌న కామెంట్స్

Hardik Patel : మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ త‌న‌ను విస్మ‌రించడంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు గుజ‌రాత్ లో బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరొందిన హార్దిక్ ప‌టేల్. త్వ‌ర‌లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ త‌రుణంలో ఆయ‌న త‌న స్వ‌రాన్ని మ‌రింత పెంచారు. ఆయ‌న ఏకంగా కాంగ్రెస్ పార్టీపై ఎక్కు పెట్టారు. విచిత్రం ఏమిటంటే నిన్న‌టి దాకా భార‌తీయ జ‌న‌తా పార్టీని విమర్శిస్తూ వ‌చ్చిన ప‌టేల్ ఉన్న‌ట్టుండి ఆ పార్టీ గురించి పొగుడుతూ కామెంట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌క‌త్వంతో పాటు హైక‌మాండ్ త‌న‌ను ప‌క్క‌న పెట్టిందంటూ ఆరోపించారు. ఇప్పుడు కాదు గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా త‌మ పార్టీ త‌న‌ను విస్మ‌రించింద‌ని వాపోయారు.

నెల రోజులకు ముందు బీజేపీని మెచ్చు కోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ముఖ పాటిదార్ వ‌ర్గానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు హార్దిక్ ప‌టేల్. తాను భార‌తీయ జ‌న‌తా పార్టీతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు.

ఇదిలా ఉండ‌గా ఇదే స‌మ‌యంలో బీజేపీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయంగా ఇటీవ‌ల బీజేపీ తీసుకున్న నిర్ణ‌యాలు బాగున్నాయంటూ కితాబు ఇచ్చారు.

పార్టీ ప‌రంగా వాటిని ఒప్పుకోకుండా ఉండ‌క త‌ప్ప‌ద‌న్నారు. గుజ‌రాత్ లో ప్ర‌స్తుతం కాంగ్రెస్ బ‌లంగా ఉంద‌ని, కానీ నాయ‌క‌త్వ లేమి స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతోంద‌న్నారు హార్దిక పటేల్(Hardik Patel) .

ఇదిలా ఉండ‌గా 2015లో గుజ‌రాత్ లో కోటా కోసం శ‌క్తివంత‌మైన పాటిదార్ క‌మ్యూనిటీ చేప‌ట్టిన ఆందోళ‌న‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీ త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వడం లేద‌ని, త‌న‌ను వెళ్ల‌గొట్టేందుకు య‌త్నిస్తోందంటూ ఆరోపించారు. ఈ త‌రుణంలోనే ప‌టేల్ బీజేపీని పొగ‌డ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read : ట్రెజ‌రీ కేసులో లాలూకు బెయిల్

Leave A Reply

Your Email Id will not be published!