Chegondi Harirama Jogaiah: కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు !

కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు !

Chegondi Harirama Jogaiah: ఏపీలో జనసేన పార్టీలో ఆశక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన ఉమ్మడి మొదటి బహిరంగ సభ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు సంక్షేమ సేన అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య(Chegondi Harirama Jogaiah), కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం… బహిరంగ లేఖల రూపంలో తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లతో పాటు పవన్ షేరింగ్ డిమాండ్ చేయడంతో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారంటూ ఆరోపించారు. అంతేకాదు చంద్రబాబు లేదా లోకేష్ ను సీఎం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప… 20 శాతం పైగా ఉన్న కాపు సామాజిక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తాను మాత్రం సీఎం అవ్వాలని అనుకోవడం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Chegondi Harirama Jogaiah Shocking Comments

అదే సమయంలో చేగొండి హరి రామజోగయ్య వారసుడు, జనసేన పిఏసీ సభ్యులు చేగొండి సూర్య ప్రకాష్… సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మరోవైపు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ను కూడా వైసీపీలోనికి ఆహ్వానించడానికి… వైసీపీ అధిష్టానం సిఎంఓ నుండి కాకినాడ ఎంపీ వంగా గీత కు పిలుపువచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ముద్రగడ పద్మనాభం లేదా… అతని కుటుంబ సభ్యులకు పిఠాపురం అసెంబ్లీ సీటును కేటాయిస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరి రామజోగయ్య ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు.

తన రాజకీయ జీవితం చివరి చరమాంకం వరకు జనసేనలోనే ఉంటానని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. తనపై వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటా. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల భవిష్యత్తు కోరుకునే కొందరు జనసేన సలహాదారులు నా పనులను సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నారు. వారు జనసేన గొడుగులో ఉండే కోవర్టులు. ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా నేను చేయాలనుకున్నదే చేస్తాను. నాకు కావాల్సిందల్లా పవన్ రాజకీయ ఎదుగుదల” అని జోగయ్య స్పష్టం చేశారు.

Also Read : TSRTC: తెలంగాణా ఆర్టీసీకి అవార్డుల పంట !

Leave A Reply

Your Email Id will not be published!