Harish Rao: సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ నేత హరీష్‌రావు భేటీ
సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ నేత హరీష్‌రావు భేటీ
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిని… మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. సీఎంతో అరగంటకు పైగా హరీష్‌రావు(Harish Rao) మాట్లాడారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం రేవంత్(CM Revanth Reddy) తో హరీష్ రావు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం మీడియాతో హరీష్‌రావు మాట్లాడుతూ… సీతాఫల్‌మండి జూనియర్, డిగ్రీ కళాశాల విషయంలో పద్మారావుతో కలసి సీఎం రేవంత్‌ను కలిశాను. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీతాఫల్‌మండి కళాశాలకు రూ.32కోట్లు కేటాయించారు. కేసీఆర్ కేటాయించిన పనులను రేవంత్ ప్రభుత్వం అర్థాంతరంగా ఆపేసింది. ఈ నేపథ్యంలో సీఎంను కలిసి సీతాఫల్ మండి కాలేజీ పనులను కొనసాగించాలని కోరానని తెలిపారు. అలాగే మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మారావు మాట్లాడుతూ…‘‘మేము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారు. 15 నిమిషాల పాటు సీఎంతో ఏమీ మాట్లాడలేదు. నా నియోజకవర్గంలో కేసీఆర్(KCR) మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరాం. సీఎం వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఆ పేపర్ ఇచ్చి చేయమని చెప్పారు’’అని పద్మారావు తెలిపారు. పద్మారావు రమ్మన్నారని తాను కూడా వెళ్లినట్లు హరీష్‌రావు పేర్కొన్నారు.
కాగా, అంతకు ముందు.. సీఎం రేవంత్ ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి చెన్నై బయలుదేరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమినేషన్‌పై రేపు (శనివారం) చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి రేవంత్ హాజరుకానున్నారు.
Harish Rao – అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల బంధం బయపడింది – హరీష్ రావు
కాంగ్రెస్, బీజేపీ పార్టీల ‘బడే భాయ్… చోటే భాయ్ బంధం’ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారని హరీష్ రావు అన్నారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకపోయినా… తన ప్రసంగంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పల్లెత్తు మాట అనలేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి తాము సమాన దూరంగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీది తెలంగాణ ప్రజల పక్షమని తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ కంటే.. సభలో బీఆర్ఎస్‌ను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిపై తాను మాట్లాడినంత గట్టిగా ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. తాను రేవంత్ బట్టలు విప్పితే.. మహేశ్వరరెడ్డి రేవంత్‌ను కవర్ చేశారని అన్నారు. కాంగ్రెస్ పిలిస్తే పోవటం లేదని డీఎంకే నేతల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెన్నైవెళ్తున్నారని తెలిపారు.దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై మెదట మాట్లాడిందే బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ పార్టీకి ఓ స్టాండ్ లేదు… క్లారిటీ లేదని హరీష్‌రావు విమర్శించారు.
Also Read : MLA Maheshwar Reddy: ప్రభుత్వం నిమిషానికి కోటి రూపాయలు అప్పు చేస్తోంది: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి