Harish Rao : శ్వేత ప‌త్రంపై త‌న్నీరు క‌న్నెర్ర‌

ఇదంతా త‌ప్పుల త‌డ‌క‌గా ఉంద‌ని ఫైర్

Harish Rao : హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డ్డారు. డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఏం జ‌రిగింద‌నే దానిపై పూర్తి వివ‌రాల‌తో త‌యారు చేసిన శ్వేత ప‌త్రాన్ని విడుద‌ల చేశారు. దీనిపై చ‌ర్చ‌లో పాల్గొన్నారు హ‌రీశ్ రావు.

Harish Rao Serious

గ‌త ప్ర‌భుత్వంపై అకార‌ణంగా నింద‌లు వేసేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నం త‌ప్ప చేసింది ఏమీ లేద‌ని ఆరోపించారు. ఒక రాష్ట్రం అభివృద్ది చెందాలంటే అప్పులు చేయ‌క త‌ప్ప‌ద‌న్నారు. తాము కూడా చేసింది ఇదేన‌ని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీశామంటూ ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు హ‌రీశ్ రావు.

ఒక‌వేళ రాష్ట్ర ప‌రిస్థితి బాగోలేక పోతే రుణాలు ఎవ‌రు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. నిధులు శ‌ర‌వేగంగా వ‌స్తేనే ప్రాజెక్టులు, ఇత‌ర ప‌నులు చేప‌ట్టేందుకు మార్గం ఏర్ప‌డుతుంద‌న్నారు హ‌రీశ్ రావు(Harish Rao). ఆ మాత్రం తెలుసుకోకుండా నోరుంద‌ని నింద‌లు వేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు.

క‌రోనా క‌ష్ట కాలంలో ఆర్థిక ప‌రిస్థితి మ‌న రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఒకేలా ఉంద‌న్నారు. ఆ విష‌యం తెలుసుకోక పోతే ఎలా అని మండిప‌డ్డారు. ఈ నివేదిక‌ను త‌నిఖీ చేసేందుకు ఒక హౌస్ క‌మిటినీ నియ‌మించాల‌ని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

Also Read : Pallavi Prashanth : నేను ఎక్క‌డికీ పోలేదు

Leave A Reply

Your Email Id will not be published!