Harish Rao : కాంగ్రెస్ 420 మేనిఫెస్టో

మంత్రి హ‌రీశ్ రావు సెటైర్

Harish Rao : హైద‌రాబాద్ – రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి మ‌రింత రాజుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ గా మారి పోయింది. ఇరు పార్టీల‌కు చెందిన నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు మ‌రింత పెంచారు.

Harish Rao Slams Congress

వీరి మాట‌ల‌ను ప్ర‌జ‌లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయినా ప‌ట్టించు కోవ‌డం లేదు. ఎన్నిక‌ల సంఘం కానీ న్యాయ వ్య‌వ‌స్థ కానీ చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఈ త‌రుణంలో తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు(Harish Rao) నిప్పులు చెరిగారు. ఆయ‌న ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ 42 పేజీల‌తో 68 అంశాల‌తో మేని ఫెస్టోను రిలీజ్ చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించారు. అది 43 పేజీల మేనిఫెస్టో కాద‌ని 420 మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు.

ఎన్ని హామీలు ఇచ్చినా ఎంత‌గా ప్ర‌లోభాల‌కు గురి చేసినా ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీని న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. వీరి నిర్వాకం వ‌ల్ల‌నే తెలంగాణ అన్యాయానికి గురైంద‌న్నారు. 1200 మంది బ‌లిదానం చేసుకున్న‌ది ఆ పార్టీ కార‌ణంగానేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు హ‌రీశ్ రావు.

Also Read : Vijaya Shanti : హ‌స్తం గూటికి రాముల‌మ్మ

Leave A Reply

Your Email Id will not be published!