Harish Rawat : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం హరీష్ రావత్ సంచలన కామెంట్స్ చేశారు. తాను తప్పు చేసినట్లు రుజువు చేస్తే పార్టీ నుంచి తప్పించండి అని కోరారు.
వీలైతే బహిష్కరించినా తాను ఒప్పుకుంటానని స్పష్టం చేశారు. హోలీని ప్రస్తావిస్తూ చెడును వదిలించు కునేందుకు ఇది సముచితమైన సందర్భమన్నారు.
తాజాగా ఉత్తరాఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు హరీష్ రావత్ (Harish Rawat). పార్టీ హైకమాండ్ సైతం ఆయనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించింది.
చివరి దాకా బీజేపీకి ఫైట్ ఇస్తూ వచ్చినా చివర్లో చేతులెత్తేసింది. ఈ తరుణంలో అటు భారతీయ జనతా పార్టీకి చెందిన సీఎం పుష్కర్ సింగ్ ధామీతో పాటు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన హరీష్ రావత్ సైతం ఓడి పోయారు.
ఎన్నికల సందర్బంగా టికెట్ల కేటాయింపులో డబ్బులు తీసుకున్నానని, అక్రమాలకు పాల్పడ్డానని ఆరోపణలు చేయడాన్ని స్వాగతించారు.70 ఏళ్లకు పైగా తన సుదీర్ఘ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమన్నారు.
ఒకవేళ నిజమని నమ్మితే పార్టీ విధించే ఏ శిక్షకైనా తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు హరీష్ రావత్. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచార సారథిగా ఎన్నో ఏళ్ల పాటు పని చేశానని తెలిపారు.
ఈ ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్నారు. సీఎంగా, ప్రాంతీయ పార్టీ చీఫ్ గా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా తాను పని చేశానని చెప్పారు హరీష్ రావత్.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తనపై ఆరోపణలు చాలా తీవ్రమైనవని తాను విచారణకు సిద్దమన్నారు.
Also Read : ప్రమాదంలో ప్రజాస్వామ్యం – అఖిలేష్