Harishrao: జూబ్లీహిల్స్‌ పోలీసుల అదుపులో హరీశ్‌రావు మాజీ పీఏ !

జూబ్లీహిల్స్‌ పోలీసుల అదుపులో హరీశ్‌రావు మాజీ పీఏ !

Harishrao: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల గోల్‌మాల్‌ వ్యవహారంలో నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మాజీ పీఏ నరేశ్‌ కుమార్‌తో పాటు కొర్లపాటి వంశీ, వెంకటేశ్‌గౌడ్‌, ఓంకార్‌ ఉన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు దుర్వినియోగమయ్యాయంటూ మెదక్‌ జిల్లాకు చెందిన రవినాయక్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Harishrao – నరేశ్ కుమార్ అరెస్ట్ పై స్పందించిన హరీశ్‌ రావు కార్యాలయం

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల గోల్‌మాల్‌ వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao) కార్యాలయం స్పందించింది. హరీశ్‌రావు పీఏ… సీఎంఆర్ఎఫ్‌ చెక్కులు కాజేశారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. నరేశ్‌ అనే వ్యక్తి హరీశ్‌రావు వద్ద పీఏ కాదని, కంప్యూటర్‌ ఆపరేటర్‌గా… తాత్కాలిక ఉద్యోగిగా కార్యాలయంలో పనిచేశారని తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత డిసెంబరు 6న కార్యాలయం మూసివేసి సిబ్బందిని పంపించేశామని తెలిపారు. ఆ క్రమంలో సమాచారం లేకుండా కొన్ని చెక్కులను నరేశ్‌ తన వెంట తీసుకెళ్లినట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై వెంటనే నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కార్యాలయానికి వర్తింపజేయడం బాధాకరమన్నారు.

Also Read : KTR: పదేళ్ల నిజం బీఆర్ఎస్… వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌ – కేటీఆర్‌

Leave A Reply

Your Email Id will not be published!