Harshal Patel : ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలని ప్రయత్నించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆశలపై నీళ్లు చల్లాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్(Harshal Patel) . 4 ఓవర్లు వేసి 35 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు.
దీంతో ఆర్సీబీ 13 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్స్ కు వెళ్లే రేసులో నిలిచింది. ఈసారి బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం పాటలో భారీ ధరకు కొనుగోలు చేసింది ఆర్సీబీ మేనేజ్ మెంట్.
రూ. 10.25 కోట్లకు చేజిక్కించుకుంది హర్షల్ పటేల్ ను. తనపై నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాణిస్తున్నాడు పటేల్(Harshal Patel). పూర్తి పేరు హర్షల్ విక్రమ్ పటేల్. 23 నవంబర్ 1990. వయస్సు 31 ఏళ్లు. గుజరాత్ లోని సనంద్ హర్షల్ స్వస్థలం.
కుడి చేతి పేస్ బౌలర్. బ్యాటర్ కూడా. అవసరమైన సమయంలో కీలకంగా మారగలడు. అందుకే అంత ధర పెట్టి కొనుగోలు చేసింది. 19 నవంబర్ 2021లో న్యూజిలాండ్ తో టీ20 మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు.
2009-2011 దాకా గుజరాత్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2011 నుంచి హర్యానాకు ఆడుతున్నాడు. 2018 నుంచి 2020 దాకా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఐపీఎల్ లో ఆడాడు.
2021 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతడికి ఇంకో పేరు కూడా ఉంది. పర్చుల్ పటేల్ అని. రంజీ ట్రోఫీలో హర్యానాకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు.
వినూ మన్కడ్ ట్రోఫీలో ఏకంగా 23 వికెట్లు తీశాడు పటేల్. 2010లో అండర్ 19 ప్రపంచ కప్ లో భారత జట్టులో చోటు దక్కింది.
Also Read : రఫ్పాడించిన భానుక రాజపక్స