KTR ; తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు అరుదైన చాన్స్ దక్కింది. ఇప్పటికే ఆయన పలు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. ప్రధానంగా ఐటీ, పరిశ్రమలే కాదు వివిధ రంగాలకు సంబంధించి అపారమైన అవగాహన ఉంది.
దేనినైనా విడమర్చి చెప్పగలిగే సామర్థ్యం కూడా ఉండడంతో సీఎం కేసీఆర్ ఏరికోరి కేటీఆర్ కు ఈ రెండు ప్రధాన శాఖలు అప్పగించారు. కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారింది.
ప్రస్తుతం ఐటీ హబ్, ఫార్మా హబ్, అగ్రి హబ్ గా మారింది. ఆయన సారథ్యంలోనే టీ హబ్ విస్తృతంగా పని చేస్తోంది. వందలాది కంపెనీలు హైదరాబాద్ లో కొలువు తీరాయి.
తాజాగా ప్రపంచ ప్రఖ్యాత హార్వార్డ్ విశ్వ విద్యాలయం నుంచి కేటీఆర్ (KTR)కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈనెల 20న జరగబోయే ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆయనను కోరింది.
ఇండియా @2030 ట్రాన్స్ ఫార్మేషనల్ డికేడ్ అనే అంశంపై మంత్రి కేటీఆర్(KTR) తన అనుభవాలను, భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై ప్రసంగిస్తారు.
సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. భారత దేశం పురోగతి జరగాలంటే ప్రభుత్వాలు వివిధ రంగాలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.
వ్యాపారం, వాణిజ్యం, ప్రభుత్వ విధానాలు, మహిళలకు ప్రాధాన్యత , ఇంక్యుబేటర్లు, ఐటీ, దాని అనుబంధ రంగాలపై తీసు కోవాల్సిన చర్యల గురించి ఫోకస్ పెడతారు.
Also Read : నిలిచి పోయిన ట్రూజెట్ సేవలు