Haryana CM : డేరా బాబా పెరోల్ పై సీఎం దాట‌వేత‌

మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ షాకింగ్ కామెంట్స్

Haryana CM : దేశంలో మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం కొలువు తీరాక స్వాములకు ప్ర‌యారిటీ పెరిగింది. ప‌లువురు విద్వేష పూరిత ప్ర‌సంగాల‌తో హోరెత్తిస్తున్నారు. ఇటీవ‌లే సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. మ‌తాలు మంచిని పెంచాలే త‌ప్పా విద్వేషాలు రెచ్చ‌గొట్ట కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ త‌రుణంలో తాజాగా కోట్లాది రూపాయ‌లు, రేప్ ల‌కు పాల్ప‌డి ఎన్నో కేసుల‌ను ఎదుర్కొంటున్న హ‌ర్యానాకు చెందిన డేరా బాబా గుర్మీత్ రామ్ ర‌హీమ్ జైలులో ఉన్నారు. ఈ త‌రుణంలో ఆయ‌న‌కు పెరోల్ ల‌భించ‌డం తీవ్ర వివాదానికి దారి తీసింది.

ఈ సంద‌ర్భంగా ఎందుకు పెరోల్ ఇవ్వాల్సి వ‌చ్చింద‌నే దానిపై స‌మాధానం ఇవ్వ‌కుండా దాట వేసే ప్ర‌య‌త్నం చేశారు హ‌ర్యానా బీజేపీ సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్(Haryana CM).

రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ముందు అత్యాచారం, హ‌త్య కేసులో 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభ‌విస్తున్న డేరా బాబాను విడుద‌ల చేశారు. పెరోల్ కు సంబంధించి స్పందించేందుకు నిరాక‌రించారు. ఇదిలా ఉండ‌గా జైళ్ల‌కు వాటి స్వంత నియమాలు ఉన్నాయి. నేను దానిపై కామెంట్స్ చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు మ‌నోహ‌ర్ లాల్ ఖట్ట‌ర్.

ఇదిలా ఉండ‌గా ఈనెల ప్రారంభంలో విడుద‌లైన‌ప్ప‌టి నుండి రామ్ ర‌హీమ్ ఆన్ లైన్ స‌త్సంగాల‌కు బీజేపీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ఇది తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో డేరా బాబాకు పెరోల్ మంజూరు చేయ‌డాన్ని కాంగ్రెస్ ప్ర‌శ్నించింది.

కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్ గా స్పందించింది. సీఎంను నిల‌దీసింది.

Also Read : ఖాన్ గ‌వ‌ర్న‌ర్ కాదు ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌

Leave A Reply

Your Email Id will not be published!