Rahul Gandhi : ద్వేషం వేగం కంటే విస్త‌రిస్తోంది – రాహుల్

కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగిన అగ్ర నేత

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో ద్వేషం వేగం కంటే ఎక్కువ‌గా విస్త‌రిస్తోంద‌న్నారు. ప్ర‌ధానంగా గాలి కంటే వేగంగా హిందూ- ముస్లిం ద్వేషం వ్యాప్తి చెందుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ( ఐక్య‌త భార‌త మార్చ్ ) శ‌నివారం దేశ రాజ‌ధాని ఢిల్లీకి చేరుకుంది.

ఈ సంద‌ర్భంగా ఈ యాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ , త‌ల్లి సోనియా గాంధీ, సోద‌రి ప్రియాంక గాంధీ, రాబ‌ర్ట్ వాద్రా, మేన కోడ‌లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయ‌కులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దేశ రాజ‌ధాని రెడ్ ఫోర్ట్ వేదిక‌గా జ‌రిగిన బహిరంగ స‌భ‌లో రాహుల్ గాంధీ పాల్గొని ప్ర‌సంగించారు.

ఆయ‌న‌తో పాటు క‌మ‌ల్ హాస‌న్ కూడా మాట్లాడారు. ఒక భార‌తీయుడిగా తాను రాహుల్(Rahul Gandhi) యాత్ర‌లో పాల్గొన్నాన‌ని చెప్పారు. దేశంలో పేరుకు పోయిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా ఉండేందుకే, ప్ర‌జ‌ల దృష్టిని వాటి వైపు చూడ‌కుండా ఉండేందుకే మ‌తం పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చెందేలా చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

మ‌త ప‌ర‌మైన విభేదాల‌ను ఆయుధంగా చేసుకొని విద్వేసాన్ని వ్యాప్తి చేయ‌డం దారుణ‌మ‌న్నారు. కేంద్ర స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నేను 2,800 కిలోమీట‌ర్ల‌కు పైగా న‌డిచాను. కానీ ఎక్క‌డా ద్వేషం క‌నిపించ లేద‌న్నారు రాహుల్ గాంధీ. కానీ ఎప్పుడైతే టీవీ ఆన్ చేస్తే పూర్తిగా హింస‌తో కూడిన ద్వేష పూరిత‌మైన కామెంట్స్ వినిపిస్తున్నాయ‌ని ఆరోపించారు.

Also Read : భార‌త్ జోడో యాత్ర‌ను ఏ శ‌క్తి ఆప‌లేదు

Kamal Haasan Rahul Yatra : రాహుల్ యాత్ర‌లో లోక‌నాయ‌కుడు

 

Leave A Reply

Your Email Id will not be published!