Delhi High Court : సీఎం ఇంటిపై దౌర్జ‌న్యం భ‌ద్ర‌తా వైఫ‌ల్యం

ఢిల్లీ పోలీసుల‌పై హైకోర్టు సీరియ‌స్

Delhi High Court : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇంటిపై దౌర్జ‌న్యం జ‌ర‌గ‌డం, దాడికి పాల్ప‌డ‌డం ముమ్మాటికీ ఢిల్లీ పోలీసుల భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌మేనంటూ సీరియ‌స్ అయ్యింది హైకోర్టు. ఇది పూర్తి బాధ్య‌తా రాహిత్యాన్ని, నిర్ల‌క్ష్యాన్ని సూచిస్తోందంటూ మండిప‌డింది.

ఎలాంటి భావ‌జాలంతో సంబంధం లేకుండా విధులు నిర్వ‌హించాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు. సీఎం నివాసం , దానికి వెళ్లే ర‌హ‌దారి వ‌ద్ద చేసిన బందోబ‌స్తు ప‌రి పోద‌ని తెలిపింది.

కొంత మంది దుర్మార్గులు కేజ్రీవాల్ ఇంటి గేటు వ‌ద్ద‌కు చేరుకుని ఆ ప్రాంతాన్ని ద్శంసం చేయ‌కుండా నిరోధించ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నివాసానికి భ‌ద్ర‌త క‌ల్పించ‌డంపై ఢిల్లీ పోలీసులు దాఖ‌లు చేసిన స్టేట‌స్ రిపోర్ట్ పై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) సోమ‌వారం తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసింది.

ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ఆస్తుల‌ను ధ్వంసం చేయ‌కుండా నిరోధించ‌డంలో, అడ్డు కోవ‌డంలో విఫ‌లం అయ్యారంటూ కోర్టు పేర్కొంది.

సీఎం నివాసంలో జ‌రిగిన దాడిపై సిట్ (ప్ర‌త్యేక ద‌ర్యాప్తు ) తో విచార‌ణ జ‌రిపించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ పిటిష‌న్ పై తాత్కాలిక న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విపిన్ సంఘీ, న‌వీన్ చావ్లాతో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై పోలీస్ క‌మిష‌న‌ర్ నివేదిక ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దారుణం. ఇది చాలా క‌ల‌వ‌ర పెట్టే అంశ‌మ‌ని తీవ్రంగా వ్యాఖ్యానించింది.

Also Read : ప్ర‌ధాని మోదీతో ఈయూ చీఫ్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!