Nidhi Pundhir : సేవా సంస్థలకు హెచ్‌సీఎల్ ఆసరా
ఫౌండేషన్ డైరెక్టర్ నిధి పుందిర్
Nidhi Pundhir : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో కంపెనీలు స్వచ్చంధ సేవా సంస్థల (ఎన్జీఓలు)కు తోడ్పాటు అందిస్తున్నాయి. వివిధ రంగాలకు చెందిన పేరొందిన సంస్థలన్నీ తమ తమ ప్రాధాన్యతా క్రమంలో ప్రయారిటీ ఇస్తూ వస్తున్నాయి.
సమాజ సేవలో భాగం పంచుకుంటున్నాయి. ఇక భారత దేశంలోని టాప్ ఐటీ కంపెనీలలో ఒకటిగా పేరొందింది హెచ్‌సీఎల్. దీని వ్యవస్థాపకుడు శివ్ నాడర్. ఆయన తనకు వచ్చిన ఆదాయాన్ని అత్యధికంగా సమాజానికి తిరిగి ఇచ్చేస్తున్నారు.
ఇక భారత్ లో అత్యధిక దాత, దానకర్ణుడిగా పేరొందారు విప్రో సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ. ఒక్కో కంపెనీ ఒక్కో సెక్టార్ ను ఎంపిక చేసుకుంటుంది. వాటి కోసం సపోర్ట్ చేస్తుంటుంది.
తాజాగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి పుందిర్(Nidhi Pundhir) శుభవార్త చెప్పారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణం ఈ మూడింటిలో పని చేస్తున్న స్వచ్చంద సంస్థలకు ఆర్థికంగా సాయం చేసేందుకకు ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా ఎంపిక చేసిన ఎన్జీఓలకు మూడు సంవత్సరాల పాటు ఈ గ్రాంట్ ను అందజేస్తామని తెలిపారు. ఈ ఫౌండేషన్ ను 2015లో ప్రారంభించారు.
ఈ గ్రాంటు పొందాలంటే కనీసం స్వచ్చంధ సంస్థ మూడు సంవత్సరాల పాటు పూర్తయి ఉండాలని వెల్లడించారు. ప్రభుత్వ రూల్స్ కు అనుగుణంగా నడుస్తూ ఉండాలి.
ఇక ఎంపిక కార్యక్రమాన్ని జ్యూరీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఏడాదికి రూ. 16.5 కోట్ల చొప్పున అందజేస్తామన్నారు. కేవలం ఆన్ లైన్ ద్వారా తప్ప ఏ విధంగానూ తాము దరఖాస్తులు స్వీకరించడం లేదన్నారు పుందిర్(Nidhi Pundhir).
Also Read : తల్లి చిత్ర పటం కోసం కారు ఆపిన పీఎం