HD Kumara Swamy : కాంగ్రెస్ తో కుస్తీ కమలంతో దోస్తీ
మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి
HD Kumara Swamy : జేడీఎస్ చీఫ్ , మాజీ కర్ణాటక సీఎం హెచ్ డీ కుమార స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తమ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేస్తుందని ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటనతో కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఇదిలా ఉండగా బీజేపీ, జేడీఎస్ వేర్వేరుగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశాయి. కానీ పవర్ లో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక ప్రజలు కమల సర్కార్ ను ఛీకొట్టారు.
HD Kumara Swamy Said
ఊహించని రీతిలో చక్రం తిప్పుతానని భావించారు జేడీఎస్ చీఫ్ కుమార స్వామి(HD Kumara Swamy). కానీ ప్రజలు ఆయనకు కోలుకోలేని దెబ్బ కొట్టారు. కింగ్ పిన్ అవుతానంటూ ప్రగల్భాలు పలికిన మాజీ సీఎంకు చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ.
మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్ 135 సీట్లను కైవసం చేసుకుంది. 65 సీట్లకే పరిమితమైంది బీజేపీ, ఇక కీలకంగా మారుతానని, మళ్లీ సీఎం అవుతానంటూ కలలు కన్న కుమార స్వామి పార్టీకి కేవలం 19 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మిన్నకుండి పోయారు. ఇటీవలే మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మై జేడీఎస్ తో కలిసి పని చేస్తామన్నారు. ఆ మేరకు కుమార స్వామి పీఎం మోదీని కలిశారు. బీజేపీకి మద్దతు ఇస్తామన్నారు.
Also Read : G Kishan Reddy : మణిపూర్ ఘటనపై నో కామెంట్