HD kumaraswamy : బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. హిందీ మాతృ భాష మాత్రమే కాదని అది జాతీయ భాష అంటూ కామెంట్ చేయడాన్ని తప్పు పడుతున్నారు.
కన్నడ నాట అజయ్ దేవగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య నిప్పులు చెరిగారు.
హిందీ పేరుతో తమపై రుద్దాలని, తమ భాషను తక్కువ చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ తరుణంలో మాజీ ప్రధాన మంత్రి తనయుడు కర్ణాటక మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి(HD kumaraswamy )స్పందించారు. సినిమా నటులకు ఇతర ప్రాంతాల గురించి పట్టించు కోవాల్సిన అవసరం లేదన్నారు.
ఈ దేశంలో భిన్న కులాలు, మతాలు, వర్గాలు, భాషలు ఉన్నాయి. ఒకే భాషను రుద్దాలని చూడడం, అదే గొప్పదని అనుకోవడాన్ని తాము ఒప్పుకోబోమన్నారు. భారతీయ జనతా పార్టీ కావాలని కెలుకుతోందని, కానీ ప్రజలతో ఛీత్కారం తప్పదని హెచ్చరించారు.
ఇదే సమయంలో హిందీ భాష మన మాతృ భాష అంటూ అజయ్ దేవగన్ చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. నీకు కావాలని అనుకుంటే భారతీయ జనతా పార్టీలో చేరు. దాని జెండా పట్టుకో.
కానీ ఆ పార్టీకి మౌత్ పీస్ గా ఉండాలని ప్రయత్నం చేయకు అని హెచ్చరించారు. ఇంకోసారి ఇతర భాషలను కించపరిచేలా మాట్లాడితే సహించే ప్రసక్తి లేదన్నారు కుమార స్వామి.
Also Read: భారత్ పై ఇంకొకరి పెత్తనం సహించం – జైశంకర్